రైళ్లు ఎక్కడ ఆగాలో కూడా మేం చెప్పాలా? అత్యున్నత న్యాయస్థానం పోస్టాఫీసులా కనిపిస్తోందా..? అంటూ పిటిషనర్‌ను నిలదీసింది సుప్రీంకోర్టు. వందే భారత్ రైలుకు తన సొంత జిల్లాలో స్టాప్ కేటాయించేలా రైల్వే శాఖను ఆదేశించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వందే భారత్ ట్రైన్‌ను కేరళలలోని తిరూరు స్టాపింగ్‌లో ఆపాలంటూ లాయర్ పీటీ శిజిష్ పిటిషన్ వేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. రైళ్లకు ఎక్కడ స్టాపింగ్ ఇవ్వాలో తాము ఆదేశించలేమని వ్యాఖ్యానించింది. ట్రైన్స్ హాల్టింగ్ అంశంపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటుందని, ఆయా స్టేషన్లలో ట్రైన్ ఆపాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం. తిరూర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్ స్టాప్ కోసం తొలుత సౌత్ రైల్వేకు రిక్వెస్ట్ పెట్టారు. అక్కడి నుంచి రెస్పాండ్స్ రాకపోవడంతో.. కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తిరూర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఆపేలా ఆదేశించాలంటూ విజ్ఞప్తి చేశారు. రాజకీయ కారణాలతో తిరూర్‌లో స్టాప్ తొలగించారని పిటిషన్‌లో ఆరోపించారు. అయితే, ఈ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టేసింది. దాంతో లాయర్ శీజిష్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం.. విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. పిటిషన్‌ను కొట్టేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..