Indian Soldier: అంతులేని ఆవేదన.. ఆర్మీ అధికారి ఆచూకీ చెప్పాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్..

SC sent notice to central: ఒకటి కాదు.. రెండు కాదు.. పాతికేళ్లు గడిచిపోయాయి. అయినప్పటికి సరిహద్దులను కాపాడడానికి వెళ్లిన తన బిడ్డ జాడ తెలియకపోవడంతో 81 ఏళ్ల ఆ తల్లి తల్లడిల్లుతోంది.

Indian Soldier: అంతులేని ఆవేదన.. ఆర్మీ అధికారి ఆచూకీ చెప్పాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్..
Sanjit Bhattacharya
Follow us

|

Updated on: Apr 16, 2022 | 7:38 AM

SC sent notice to central: ఒకటి కాదు.. రెండు కాదు.. పాతికేళ్లు గడిచిపోయాయి. అయినప్పటికి సరిహద్దులను కాపాడడానికి వెళ్లిన తన బిడ్డ జాడ తెలియకపోవడంతో 81 ఏళ్ల ఆ తల్లి తల్లడిల్లుతోంది. గుజరాత్‌ సరిహద్దులో పాతికేళ్ల క్రితం అదృశ్యమైన తన కొడుకు సంజిత్‌ భట్టాచార్య ఆచూకీని చెప్పాలని ఆయన తల్లి కమల భట్టచార్జి ఆఖరికి సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కెప్టెన్‌ని విడుదల చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కెప్టెన్‌ తల్లి డిమాండ్‌ చేస్తు్న్న విషయం తెలిసిందే. కాగా.. ఏప్రిల్‌ 20, 1997న కెప్టెన్‌ సంజిత్‌ భట్టాచార్జి (Captain Sanjit Bhattacharya), లాన్స్‌ నాయక్‌ రామ్‌బహదూర్‌ను గుజరాత్‌ సరిహద్దులో చెరబట్టాయి పాక్‌ బలగాలు. అప్పటినుంచి వాళ్ల సమాచారం తెలియడం లేదు. లాహోర్ జైల్లో వాళ్లు ఉన్నట్టు కుటుంబసభ్యులకు సమాచారం ఉంది. కానీ పాకిస్తాన్‌ ప్రభుత్వం మాత్ర వాళ్ల జాడ చెప్పడం లేదు. కెప్టెన్‌ సంజిత్‌ గురించి సమాచారం చెప్పాలని పలుమార్లు భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని కోరింది. కానీ పాకిస్తాన్‌ నుంచి ఎలాంటి జవాబు రాలేదు. దాదాపు 83 మంది భారత జవాన్లు పాకిస్తాన్‌ జైల్లో ఉన్నట్టు కేంద్రం దగ్గర సమాచారం ఉంది.

గూర్ఖా రెజిమెంట్‌కు చెందిన సంజిత్‌ అప్పటికే ఐదేళ్ల పాటు భారత సైన్యానికి సేవలే అందించారు. గుజరాత్‌ లోని రాణా ఆఫ్‌ కచ్‌ ఎడారి ప్రాంతంలో విధుల్లో ఉండగా ఆకస్మాత్తుగా అదృశ్యమయ్యారు కెప్టెన్‌ సంజిత్‌. రెండు రోజుల పాటు ఆయన కోసం బోర్డర్‌లో ఆర్మీ బృందాలు గాలించాయి. అయినప్పటికి లాభం లేకుండా పోయింది. ఎరియల్‌ సర్వే నిర్వహించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. 1996-2010 మధ్య 21 మంది భారత జవాన్లు అదృశ్యమయ్యారు. వాళ్లంతా పాకిస్తాన్‌ ఆధీనం లోనే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కెప్టెన్‌ సంజిత్‌ ఆచూకీని కనుక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని, కానీ పాకిస్తాన్‌ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని భారత ప్రభుత్వం ఆరోపించింది.

Also Read:

Viral Video: పట్టాల మధ్య మహిళ.. ట్రాక్ పై పరుగులు పెడుతున్న రైలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Kim Jong-un: కిమ్ మామూలోడు కాదు.. హ్యాకర్స్‌తో క్రిప్టో కరెన్సీ దోపిడీ.. FBI సంచలన ప్రకటన..

Latest Articles