Social Media: సోషల్‌ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా.? మూల్యం చెల్లించాల్సిందే..

ఓ మహిళ జర్నలిస్టు మీద సోషల్‌మీడియాలో ఓ వార్త షేర్‌ అయింది. ఈ పోస్టును చూసిన తమిళనాడు మాజీ ఎమ్మెల్యే శేఖర్‌ అనే వ్యక్తి షేర్‌ చేశారు. దీనిపై సదరు జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వెంటనే సదరు ఎమ్మెల్యే చెన్నై కోర్టును ఆశ్రయించారు. అనుకోకుండా జరిగింది. కేసు కొట్టేయాలని అభ్యర్థించారు. దీనికి నిరాకరించిన హైకోర్టు.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. వెంటే ఆ ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2018 ఏప్రిల్‌ 20న తన క్లయింట్‌...

Social Media: సోషల్‌ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా.? మూల్యం చెల్లించాల్సిందే..
Social Media

Edited By: Narender Vaitla

Updated on: Aug 20, 2023 | 6:41 PM

సోషల్‌ మీడియాలో ఎక్కువగా కాలం గడిపేవారికి ఓ హెచ్చరిక. కాదు కాదు.. ఓ సుతిమెత్తని సురుకు లాంటి వార్త. ఏదైన పోస్టు పెట్టే ముందు ఆలోచించాలి. పెట్టిన తర్వాత ఆలోచించడం, డిలీట్‌ చేయడం, సారీ చెప్పడం చేస్తే కుదరదు అని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు దానికి తగ్గ పర్యవసానం కూడా ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. మనం పెట్టే పోస్టు ఎక్కడి దాక వెళ్తుంది. దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది స్పృహలో ఉండి ప్రవర్తిస్తే మేలు అని స్పష్టం చేసింది సుప్రీం. ఇదంత తమిళనాడు మాజీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

ఓ మహిళ జర్నలిస్టు మీద సోషల్‌మీడియాలో ఓ వార్త షేర్‌ అయింది. ఈ పోస్టును చూసిన తమిళనాడు మాజీ ఎమ్మెల్యే శేఖర్‌ అనే వ్యక్తి షేర్‌ చేశారు. దీనిపై సదరు జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వెంటనే సదరు ఎమ్మెల్యే చెన్నై కోర్టును ఆశ్రయించారు. అనుకోకుండా జరిగింది. కేసు కొట్టేయాలని అభ్యర్థించారు. దీనికి నిరాకరించిన హైకోర్టు.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. వెంటే ఆ ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2018 ఏప్రిల్‌ 20న తన క్లయింట్‌ కళ్లలో మందు వేసుకోవడం వల్ల ఫేస్‌బుక్‌లో కనిపించిన పోస్టును సరిగా చూడకుండానే షేర్‌ చేశారు అని తన తరుపు న్యాయవాది సుప్రీంలో వాదించారు.

ఇక ఆ పోస్టులోని అభ్యంతరకర వార్తల గురించి తెలిసిన వెంటనే ఆ పోస్టు తొలగించారు అని చెప్పారు. అలాగే మహిళా జర్నలిస్టుకు క్షమాపణ కూడా చెప్పారన్నారు. అనుకోని పొరబాటుగా పరిగణించి క్రిమినల్‌ కేసు కొట్టేయాలని వేడుకున్నారు. దీనిపై ఏకీభవించని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాతో జాగ్రత అవసరమని కన్నెర్ర చేసింది ధర్మాసనం. పోస్టు పెట్టి సారీ చెబితే సరిపోదని తేల్చి చెప్పింది. ఇక దీని పర్యావసానం కూడా ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. అందుకే సోషల్‌మీడియా వాడకం ఎంత ఉపయోగమో అన్ని కష్టాలు తెచ్చిపెడుతుంది. సోషల్‌మీడియాతో ఎన్ని ప్రయోజనాలో, తెలియకుండా వాడితే అన్ని కష్టాలు తెచ్చుకోవడం తప్పది. తస్మాత్‌ జాగ్రత్త.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..