Supreme Court: సుప్రీంకోర్టు కీలక ముందడుగు.. ఇకనుంచి ఆ విషయాల్లో లింగవివక్ష లేకుండా నిర్ణయం

దేశంలో లింగవివక్షపై తరచుగా వాదనలు వినిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో లింగ వివక్ష లేకుండా ఉండేందుకు మరో ముందడుగు వేసింది. కోర్టుల్లో ఉండేటువంటి కేసుల విచారణ, తీర్పుల్లో మహిళలపై ఎలాంటి లింగ వివక్ష లేకుండా నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టు కేసుల్లో విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో వినియోగించాల్సిన పదాలు, వ్యాఖ్యలకు సంబంధించి ఓ హ్యాండ్‌బుక్‌ను సుప్రీంకోర్టు బుధవారం రోజు విడుదల చేసింది.

Supreme Court: సుప్రీంకోర్టు కీలక ముందడుగు.. ఇకనుంచి ఆ విషయాల్లో లింగవివక్ష లేకుండా నిర్ణయం
Supreme Court of India

Updated on: Aug 17, 2023 | 5:19 AM

దేశంలో లింగవివక్షపై తరచుగా వాదనలు వినిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో లింగ వివక్ష లేకుండా ఉండేందుకు మరో ముందడుగు వేసింది. కోర్టుల్లో ఉండేటువంటి కేసుల విచారణ, తీర్పుల్లో మహిళలపై ఎలాంటి లింగ వివక్ష లేకుండా నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టు కేసుల్లో విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో వినియోగించాల్సిన పదాలు, వ్యాఖ్యలకు సంబంధించి ఓ హ్యాండ్‌బుక్‌ను సుప్రీంకోర్టు బుధవారం రోజు విడుదల చేసింది. కోర్టు తీర్పులు వెలువరించే సమయాల్లో ఎలాంటి అనుచిత పదాలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు సైతం తగు సూచనలు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే ‘హ్యాండ్‌బుక్‌ ఆన్‌ కంబాటింగ్‌ జెండర్‌ స్టీరియోటైప్స్‌’ అనే పేరిట 30 పేజీలు ఉన్నటువంటి పుస్తకాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆవిష్కరించారు.

కోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్లో మహిళలను ప్రస్తావిస్తూ చేసిన అనేక అనుచిత పదాలను హ్యాండ్‌బుక్‌లో సుప్రీంకోర్టు హ్యాండ్‌‌బుక్‌లో పొందుపరిచింది. అలాగే వాటికి బదులుగా ఉపయోగించాల్సిన పదాలను కూడా అందులో సూచించింది. అయితే కోర్టు తీర్పులు ఇచ్చే సమయాల్లో మహిళలపై ఎలాంటి వివిక్ష చూపే విధంగా ఉండకూడదని.. అలాంటి పదాలు సరైనవు కావని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. అలాగే ఆ తీర్పులను విమర్శించడం అనేది ఈ పుస్తకం ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అయితే వాస్తవానికి లింగత్వానికి సంబంధించి మూసపద్ధతులు ఎలా ఆచరణలో ఉన్నాయో చెప్పే్ందుకే ఈ హ్యాండ్ బుక్‌ను రూపొందించినట్లు తెలియజేశారు. లింగ వివక్షకు నిర్వచనం.. అలాగే న్యాయాధికారుల్లో అవగాహనను పెంపొందించడం కోసం ఈ బుక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

అందరికి ఈ విషయాల పట్ల అవగాహన కల్పించడమే ఈ బుక్ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే మహిళలపై మూసధోరణిలో వాడేటటువంటి పదాలను కూడా గుర్తించేలా ఈ బుక్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దీనివల్ల న్యాయమూర్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సప్రీంకోర్టు వైబ్‌సైట్‌లోని హ్యాండ్‍‌బుక్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ 30 పేజీలతో కూడినటువంటి హ్యాండ్ బుక్‌ను మహిళా న్యాయమూర్తుల కమిటీ రూపొందించింది. అయితే ఈ కమిటీలో జస్టీస్ ప్రభా శ్రీదేవన్, జస్టీస్ గీతా మిట్టల్ తదితరులు ఉన్నారు. అలాగే ఈ కమిటీకీ కలకత్తా హైకోర్టుకు చెందినటువంటి జస్టీస్ మౌషుమీ భట్టాచార్య నేతృత్వం వహించారు. అయితే సుప్రీంకోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. ఇక భవిష్యత్తులో కోర్టుకి సంబంధించిన కేసు విషయాల్లో లింగ వివక్ష ఉండదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.