సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీ.వై.చంద్రచూడ్ కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యారు. ఆయనతో బాటు స్టాఫ్ సభ్యుడొకరు కూడా పాజిటివ్ బారిన పడ్డారని కోర్టు వర్గాలు తెలిపాయి. జస్టిస్ చంద్రచూడ్ కోలుకుంటున్నప్పటికీ దేశంలో కోవిద్ పరిస్థితిపై దాఖలైన పిటిషన్ల మీద ఆయన ఆధ్వర్యంలోని బెంచ్ ఇప్పట్లో సమావేశం కాకపోవచ్చునని భావిస్తున్నారు.కీలకమైన ఈ పిటిషన్లపై గురువారం విచారణ జరగాల్సి ఉంది. అయితే జస్టిస్ కరోనా వైరస్ పాజిటివ్ కి గురి కావడంతో మరో తేదీకి విచారణ వాయిదా పడే సూచనలున్నాయని వారు చెప్పారు. నిజానికి ఈ కేసు హియరింగ్ కి జస్టిస్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా అది గురువారానికి వాయిదా పడిందని బార్ అండ్ బెంచ్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్,, కోవిద్ మందుల లభ్యతపై కేంద్రానికి తగిన సూచనలు చేసేందుకు 12 మంది సభ్యులతో సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ ను చంద్రచూడ్, జస్టిస్ షా లతో కూడిన బెంచ్ ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ బృందం మరో వారం రోజుల్లో తన నివేదికను కోర్టుకు, కేంద్రానికి సమర్పించాల్సి ఉంది.
కాగా దేశంలో కోవిద్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 3,48,421 కేసులు నమోదు కాగా..4,205 మంది రోగులు మరణించారు. 1,93,82,642 మంది రోగులు కోలుకున్నారు. అటు ఢిల్లీలో 18-444 ఏళ్ళ మధ్యవయస్కులకు వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. టీకామందు కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Banks Working Timings: కర్ఫ్యూ, లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణలో బ్యాంకు పనివేళల్లో మార్పులు
పెద్ద మనసు చాటుకున్న సూర్య ఫ్యామిలి…కోవిడ్‌పై పోరాటానికి రూ.కోటి విరాళం..