ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైలుపాలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఊరట లభించింది. రూ.2 లక్షల పూచీకత్తుపై సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అక్టోబర్ 21న చిదంబరంను ఈడీ అరెస్ట్ చేయగా.. సుమారు 105 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు విముక్తి లభించింది. అంతేకాకుండా చిదంబరం దేశం వదిలి వెళ్లకూడదని.. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు విధించింది. కేసు గురించి ఎవరితోనూ చర్చించకూడదని.. బహిరంగంగా ఇంటర్వ్యూలు, ప్రసంగాలు ఇవ్వకూడదని కోర్టు సూచించింది. కాగా, సాయంత్రం తీహార్ జైలు నుంచి చిదంబరం విడుదల కానున్నారు.