Fact Check: రజినీకాంత్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారంటూ ఫోటోలు వైరల్‌.. అసలు విషయం ఏంటంటే..!

Fact Check: వెండితెరపై సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు ఉన్న క్రేజే వేరు. ఆయనకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు. రజినీకాంత్‌ కాంత్‌కు సౌత్‌లోనే కాదు యావత్ ప్రపంచంలోనే..

Fact Check: రజినీకాంత్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారంటూ ఫోటోలు వైరల్‌.. అసలు విషయం ఏంటంటే..!

Updated on: Aug 02, 2021 | 11:54 AM

Fact Check: వెండితెరపై సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు ఉన్న క్రేజే వేరు. ఆయనకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు. రజినీకాంత్‌ కాంత్‌కు సౌత్‌లోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఎంతో క్రేజ్‌ ఉంది. అయితే రజినీకాంత్‌ పేరు మీద ఓ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేసినట్లుగా సంబంధిత ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన రజనీకాంత్‌ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అయితే ఈ వైరల్‌ అవుతున్న ఫోటోలు ఫేక్‌ అంటూ ఫ్యాక్ట్‌ చెక్‌లో వెల్లడైంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక ఫోటోను ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్‌ కిరణ్‌ మంజుందర్‌ షా ఆగస్టు 1న తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. రజినీకాంత్‌ మెడికల్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ కామర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ పేరిట ఈ కాలేజ్‌ బోర్డు ఉంది. దీంతో ఆమె సూపర్‌ స్టార్‌కు అరుదైన గౌరవం దక్కిందంటూ సంతోషం వ్యక్తం చేసింది. అయితే పోస్టు చేసిన కొద్దిసేపటికే ఆమె పొరపాటును గమనించి ట్వీట్‌ను డిలీజ్‌ చేసింది. అప్పటికే అది నిజమనుకుని చాలామంది ఆ ఫొటోను షేర్‌ చేశారు. ఇంకొంత మంది సెటైర్లు వేశారు.

నిజానికి అది సెటైరిక్‌గా రూపొందించిన ఒక మీమ్‌. పైగా ఎప్పుడో పదేళ్ల కిందట పుట్టుకొచ్చింది. ఎన్నో సార్లు వైరల్‌ అయ్యింది కూడా. ఇప్పుడు రజినీపై రెగ్యులర్‌గా వచ్చే మీమ్స్‌లో భాగంగా వచ్చిందా? లేదంటే యాంటీ ఫ్యాన్‌ చేసిన పనేనా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు తలైవా ఫ్యాన్స్‌ ఎవరూ ఆ ఫొటోను షేర్‌ చేయొద్దని రజినీ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తోంది. ఇక ఆ ఒరిజినల్‌ ఫొటో మాత్రం.. భువనేశ్వర్‌లోని క్సేవియర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ భువనేశ్వర్‌ యూనివర్సిటీది. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను నమ్మవద్దని రజినీకాంత్‌ అసోసియేషన్‌ కోరుతోంది. అప్పుడు ఆమె తప్పుడు పోస్టు చేయడంపై ఫ్యాన్స్‌ తెగ మండిపడిపోతున్నారు.

 

 

 

Flipkart Big Saving Days Sale: మరో బంపర్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు రానున్న ఫ్లిప్‌కార్ట్‌.. ఎప్పటి నుంచి అంటే..!

PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు.. ఎప్పుడంటే..?