High Court: భార్య అలా చేయడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు!

High Court: భార్యాభర్తలు విడివిడిగా నివసిస్తున్నారని కోర్టు గమనించింది. భర్త, గ్రామ పెద్దలు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, భార్య తిరిగి రాలేదని విచారణలో తేలింది. తన భర్తతో కలిసి జీవించాలని తాను ఎప్పుడూ కోరుకుంటున్నానని భార్య కోర్టుకు తెలిపింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్..

High Court: భార్య అలా చేయడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు!

Updated on: Dec 06, 2025 | 6:45 PM

High Court: భార్య పదే పదే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, భర్త మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం మానసిక క్రూరత్వానికి సమానమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ప్రవర్తన విడాకులకు బలమైన కారణంగా నిలుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. బలోద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు సమర్థించింది. జూన్ 2024 విడాకుల ఉత్తర్వును భార్య సవాలు చేసిందని ఓ నివేదిక పేర్కొంది. జస్టిస్ రజనీ దూబే, అమితేంద్ర కిషోర్ ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. క్రూరత్వం శారీరక హానికే పరిమితం కాదని, మనస్సులో సహేతుకమైన భయాన్ని కలిగించే ప్రవర్తన కూడా ఉంటుందని కోర్టు పేర్కొంది.

దంపతులకు 2018లో వివాహం కాగా, పెళ్లి జరిగిన కొంత కొంత కాలానికే భార్య వేదింపులు మొదలుపెట్టింది. కత్తితో పొడుచుకోవడం, పాయిజన్ తాగటం, కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోవడం లాంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేసిందని, అయితే తాను చస్తూ బతకాల్సి వస్తుందని భర్త 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Flipkart Sale: రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్‌లో బై బై 2025 సేల్.. ఎన్నడు లేని ఆఫర్లు!

అయితే బలోద్‌ జిల్లాలోని గురుర్ పోలీస్ స్టేషన్‌లో భర్త అక్టోబర్ 14, 2019న దాఖలు చేసిన లిఖితపూర్వక ఫిర్యాదును కోర్టు ప్రస్తావించింది. ఫిర్యాదులో తన భార్య ఆత్మహత్య చేసుకుంటానని పదే పదే బెదిరిస్తోందని భర్త పేర్కొన్నాడు. ఆమె విషం తాగడానికి ప్రయత్నించిందని, కత్తితో తనను తాను పొడిచి చంపుకోవడానికి ప్రయత్నించిందని, కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించిందని కూడా భర్త ఆరోపణలు గుప్పించాడు.

ఇవి కూడా చదవండి

దీంతో ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేయగా, దీనిని హైకోర్టు సైతం సమర్దించింది. క్రూరత్వం అంటే కేవలం శారీరక హింస మాత్రమే కాదని, భాగస్వామి మనసులో భయాన్ని కలిగించే ప్రవర్తన కూడా దాని కిందకే వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఆత్మహత్య బెదిరింపుల కారణంగానే భార్యను పుట్టింట్లో వదిలిపెట్టినట్టు భర్త విచారణలో తేలగా, దీనిని కోర్టు పరిగణలోకి తీసుకుంది.

ఈ చర్యల కారణంగా తాను నిరంతరం భయంతో జీవిస్తున్నానని భర్త కోర్టు ముందు వెల్లడించాడు. ఈ జంట 2018 మేలో వివాహం చేసుకున్నారు. విచారణ సమయంలో భర్త తన భార్య తనకు హాని కలిగిస్తుందనే భయంతో ఆమె తల్లిదండ్రుల ఇంట్లో వదిలి వెళ్లానని అంగీకరించాడు. భార్య పదే పదే ఆత్మహత్యాయత్నాలు, బెదిరింపులు భర్తకు నిరంతర మానసిక వేధింపుల పరిస్థితిని సృష్టించాయని ధర్మాసనం పేర్కొంది. అలాంటి ప్రవర్తన క్రూరత్వానికి నిదర్శనమని కోర్టు పేర్కొంది.

మతపరమైన ఒత్తిడి ఆరోపణ:

ఇదిలా ఉండగా, హైకోర్టు ఒక కమ్యూనిటీ ప్రతినిధి వాంగ్మూలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. భార్య, ఆమె కుటుంబం భర్తను ఇస్లాం స్వీకరించమని ఒత్తిడి చేశారని పేర్కొంది. అయితే భార్య ఆ ఆరోపణను ఖండించింది. కేసును నిర్ణయించేటప్పుడు కోర్టు పరిశీలించిన మొత్తం ప్రవర్తనా సరళిలో ఈ వాదన భాగమని ధర్మాసనం పేర్కొంది.

2019 నుండి విడివిడిగా నివసిస్తున్న జంట:

నవంబర్ 2019 నుండి భార్యాభర్తలు విడివిడిగా నివసిస్తున్నారని కోర్టు గమనించింది. భర్త, గ్రామ పెద్దలు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, భార్య తిరిగి రాలేదని విచారణలో తేలింది. తన భర్తతో కలిసి జీవించాలని తాను ఎప్పుడూ కోరుకుంటున్నానని భార్య కోర్టుకు తెలిపింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, గృహ హింస చట్టంలోని సెక్షన్ 125 కింద తాను కేసులు దాఖలు చేసిన తర్వాతే భర్త విడాకులు కోరాడని కూడా ఆమె పేర్కొంది. అయితే, మొత్తం సాక్ష్యాలను బట్టి భార్య సరైన కారణం లేకుండా భర్తను విడిచిపెట్టిందని తేలిందని హైకోర్టు పేర్కొంది.

Alcohol: ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో ఉందో తెలిస్తే షాకవుతారు!

భార్య నెలకు రూ. 2,000, మైనర్ కొడుకుకు రూ. 2,000 భరణం అందుకుంటున్నట్లు కూడా హైకోర్టు గుర్తించింది. ఈ మొత్తాన్ని గతంలోని ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి