పేరు పెట్టండి.. లక్షలు పొందండి.. టైటిల్ చూసి ఇదేదో లక్కీ డ్రా అని అనుకుంటే పొరపాటే.! దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. అందులో గెలిచినవారు లక్షల్లో బహుమతులు పొందొచ్చునని తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ఇటీవల డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్(డీఎఫ్ఐ)కి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీని తీరుతెన్నులు, లక్ష్యాలను స్పూరించే విధంగా పేరు, లోగోలతో పాటు ట్యాగ్‌లైన్‌ను సూచించాలని ఆర్ధిక శాఖ ప్రజల్ని కోరుతోంది.
దేశ సంస్కృతి ఉట్టిపడేలా, ప్రజలందరికీ అర్ధమయ్యే రీతిలో డీఎఫ్ఐ పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు ఉండాలని.. ఆగష్టు 15వ తేదీ సాయంత్రం 5.30 గంటల్లోగా ఆసక్తి కలిగినవారు తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది. ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచినవారికి రూ. 5 లక్షలు, రెండో స్థానానికి రూ. 3 లక్షలు, మూడో స్థానానికి రూ. 2 లక్షలు బహుమతులుగా అందజేస్తామన్నారు. పేరు, ట్యాగ్‌లైన్, లోగోలకు సంబంధించిన డిజైన్లను https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్ ద్వారా పంపించాలని కేంద్రం పేర్కొంది.
Also Read:
దేశంలోని ఈ ఐదు ప్రదేశాల్లో లెక్కలేనన్ని నిధులు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు..
ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!
రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!
.@FinMinIndia in association with @mygovindia is announcing a contest to crowdsource the name, tagline and logo of the new Development Financial Institution. Cash prizes of up to Rs 5 lakh in each category! Last date for entries is 15.08.2021. https://t.co/uK5AojlWlB (1/2)
— NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021