Sugar Prices: దేశంలో చక్కెర ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..? ఈ కారణాల వల్లే..

|

Nov 02, 2021 | 5:25 PM

Sugar Prices: నిత్యావసర సరుకులలో చక్కెర కూడా ఒకటి. అయితే ఇటీవల చక్కెర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం అనేకం ఉన్నాయి. పెరిగిన

Sugar Prices: దేశంలో చక్కెర ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..? ఈ కారణాల వల్లే..
Sugar
Follow us on

Sugar Prices: నిత్యావసర సరుకులలో చక్కెర కూడా ఒకటి. అయితే ఇటీవల చక్కెర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం అనేకం ఉన్నాయి. పెరిగిన ధరలతో సామన్యులు ఇబ్బందిపడుతున్నారు. కొంతకాలంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్, డీజిల్ నుంచి కూరగాయల ధరలు కూడా పెరిగాయి. దీంతో చక్కెర ధర కూడా పెరిగింది. గత మూడు నెలల్లో కిలో చక్కెర ధర రూ.5 పెరిగింది. అయితే ఉత్పత్తి తగ్గడం వల్ల చక్కెర ధర పెరగలేదు. దీనికి వేరే కారణాలు ఉన్నాయి.

చక్కెర ధర ఎంత పెరిగింది?
వినియోగదారుల వ్యవహారాల శాఖ డేటా ప్రకారం.. దేశంలో చక్కెర ధర అక్టోబర్ 26, 2021 నాటికి కిలోకు రూ.43. అంతకుముందు కిలో ధర రూ.38 మాత్రమే ఉండేది. అంటే కిలో పంచదార ధర రూ.5 పెరిగింది. దేశంలో రికార్డు స్థాయిలో చక్కెర ఉత్పత్తి జరుగుతున్నా ధరలు మాత్రం తగ్గడం లేదు పెరుగుతున్నాయి. ఇటీవల షుగర్ మిల్లులు మొత్తం 72 లక్షల టన్నుల చక్కెరను విదేశాలకు పంపించాయి. ఇందుకోసం కంపెనీలకు ప్రభుత్వం దాదాపు 8 వేల కోట్ల రూపాయల సబ్సిడీని ఇచ్చింది. విదేశాలకు చక్కెరను ఎగుమతి చేసేందుకు అయ్యే ఖర్చును భరించేందుకు మిల్లులకు ఈ సబ్సిడీని అందించారు. ఈ ఖర్చును భర్తీ చేయడానికి ప్రభుత్వం చక్కెర ధరలను పెంచింది.

ప్రపంచవ్యాప్తంగా చక్కెర మార్కెట్‌లో ఇబ్బందులు
ప్రపంచంలోని అగ్రశ్రేణి ఎగుమతిదారులు ఇప్పుడు ఎక్కువ చెరకును ఇథనాల్‌గా మారుస్తున్నారు. ఇందులో చైనా మొదటి స్థానంలో ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అక్టోబర్‌లో గ్లోబల్ మార్కెట్‌లో చక్కెర ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సరఫరాలో కొరతే ఇందుకు కారణం. చమురు ధరల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న బ్రెజిల్, భారతదేశం ఇప్పుడు చెరకు కంటే ఎక్కువ ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుండటం విశేషం.

Sleep Disorders: నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారా..! ఈ జ్యూస్‌ తాగారంటే కమ్ముకొస్తుంది..

Dandruff: చుండ్రు సమస్యతో విసిగిపోయారా..! తక్కువ ఖర్చుతో ఇలా క్లియర్‌ చేసుకోండి..

Honda Activa: 21 వేలకే హోండా యాక్టివా.. సంవత్సరం వారంటీ కూడా.. ఎక్కడంటే..?