Sudha-Mohan Kumar Love Story: పాతికేళ్ల ప్రేమకు బ్రహ్మముడి.. 54 ఏళ్ల వయసులో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సుధా-మోహన్!

|

May 16, 2024 | 9:15 AM

ప్రజా ఉద్యమాల్లో తలమునకలైన ఆ ఇద్దరికి పెళ్లి చేసుకోవడానికి పాతికేళ్లు పట్టింది. ఎట్టకేలకు వారి సుధీర్ఘ ప్రేమ కథకు శుభం కార్డు పడింది. వారే జీ సుధ, మోహన్‌ కుమార్‌లు. వీరిద్దరి వయసు ప్రస్తుతం 54 ఏళ్లు. ప్రజాపోరాటమే సుధ, మోహన్‌ కుమార్‌లను ఒక్క చోటుకు చేర్చింది. ఇన్నాళ్లూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఈ ఇద్దర కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని అమృతేశ్వర ఆలయంలో కువెంపు వివాహ..

Sudha-Mohan Kumar Love Story: పాతికేళ్ల ప్రేమకు బ్రహ్మముడి.. 54 ఏళ్ల వయసులో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సుధా-మోహన్!
Sudha Mohan Kumar Love Story
Follow us on

చిక్కమగళూరు, మే 16 : ప్రజా ఉద్యమాల్లో తలమునకలైన ఆ ఇద్దరికి పెళ్లి చేసుకోవడానికి పాతికేళ్లు పట్టింది. ఎట్టకేలకు వారి సుధీర్ఘ ప్రేమ కథకు శుభం కార్డు పడింది. వారే జీ సుధ, మోహన్‌ కుమార్‌లు. వీరిద్దరి వయసు ప్రస్తుతం 54 ఏళ్లు. ప్రజాపోరాటమే సుధ, మోహన్‌ కుమార్‌లను ఒక్క చోటుకు చేర్చింది. ఇన్నాళ్లూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఈ ఇద్దర కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని అమృతేశ్వర ఆలయంలో కువెంపు వివాహ విధానం (దండల మార్పిడి)లో బుధవారం వివాహం చేసుకున్నారు.

తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని లక్కెనహళ్లికి చెందిన మోహన్ 1995లో అజ్జంపురలో సంపూర్ణ సాక్షరతా ఆందోళన్ వాలంటీర్ల వర్క్‌షాప్‌లో తొలిసారి సుధను కలిశారు. సుధలోని నాయకత్వ లక్షణాలు ఆయనను అమితంగా ఆకట్టుకున్నాయి. 2002లో అతను ప్రపోజ్ చేయగా.. ఆమె అతని అభ్యర్ధనను మన్నించింది. మోహన్‌ బ్రాహ్మణుడు.. సుధ క్షత్రియ మరాఠా. వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరూ ఆపై వివిధ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. వివాహం చేసుకుందామనుకున్న ప్రతిసారీ ఏదో ఒక పోరాటంలో పాల్గొంటూ రావడంతో అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే వృద్ధులైన వారి తల్లులు త్వరలో వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో ఇన్నాళ్లకు వీరికి తీరిక దొరికింది. చివరకు తాను ప్రేమించిన సుధనే మోహన్‌ పెళ్లాడారు.

వీరి ప్రేమకథలో సుధ స్నేహితురాలు సునీత, మోహన్ స్నేహితుడు హర్షల పాత్ర పెద్దది. వీరిద్దరికీ భారతీయ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్‌లో మూలాలు ఉన్నాయి. దీనికి ప్రముఖ సినీ దర్శకుడు ఎమ్‌ఎస్ సత్యు ప్రోత్సాహం ఉంది. చిక్కమగళూరులో సీపీఐ నేత బీకే సుందరేష్ నేతృత్వంలో జరిగిన ఉద్యమాల్లో వీరు పాల్గొన్నారు. అటవీ నిర్వాసితుల హక్కులు, వారి భూముల కోసం సుధ అలుపెరగని పోరాటం చేశారు. అంతేకాకుండా ఆమె చాలా మంది గ్రామీణ మహిళలకు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంలోనూ సహాయపడింది. ఇక పిల్లల విషయంలోనూ సుధ – మోహన్‌లది పెద్ద మనసు. ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకుని, పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. సుధ తండ్రి ఎంఎస్ గణేష్ రావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. తన తండ్రే తనకు రోల్ మోడల్ అని గర్వంగా చెబుతున్నారు. ఇక మోహన్ తండ్రి, బాబాయిలు తమ గ్రామంలో పాఠశాలల నిర్మాణానికి సొంత భూమిని సైతం విరాళంగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.