Sumi Borah: వామ్మె.. పెద్ద స్కాంలో చిక్కిన నటి.. ప్రస్తుతం పరారీలో
రూ. 2,200 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లో బయటపడ్డ అస్సామీ నటి సుమీ బోరా పేరు తెరపైకి వచ్చింది. ఈ స్కాం వెనకాల ఉన్న సూత్రధారి బిసాల్ ఫుకాన్ ఇప్పటికే అరెస్టయ్యాడు. అతడు చెప్పిన వివరాలతో.. సుమీబోరాపై కేసు పెట్టారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

ఇన్నాళ్లూ బెట్టింగ్ యాప్‌ల గోల మామూలుగా నడవలేదు. సెలబ్రిటీలు ఈ యాప్‌లను ఎలా ప్రమోట్ చేస్తారన్న రచ్చ బీభత్సంగా నడిచింది. ఇప్పుడు మనం చూడబోయేది వివాదం కాదు.. పక్కా ఫ్రాడ్. ఇందులో ఓ హీరోయిన్ చేయి కూడా ఉందనేదే ఇక్కడ షాక్.
అస్సాం నటి, కొరియోగ్రాఫర్ సుమీ బోరా భారీ స్కాంలో ఇరుక్కున్నారు. స్టాక్‌మార్కెట్లో అధిక లాభాలను ఆశజూపి.. 1500 మందిని ముంచేశారు. ఏకంగా 2200 కోట్ల రూపాయలు స్కాం చేసినట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు.. ఐదుగురిపై కేసు నమోదు చేశారు దిబ్రుగఢ్ పోలీసులు. ఈ స్కాం వెనకాల ఉన్న సూత్రధారి బిసాల్ ఫుకాన్ ఇప్పటికే అరెస్టయ్యాడు. అతడు చెప్పిన వివరాలతో.. సుమీబోరాపై కేసు పెట్టారు. కొన్నిరోజులుగా ఆమె పరారీలో ఉండడంతో లుకౌట్ నోటీసులు జారీచేశారు పోలీసులు. అస్సాం ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉన్న సుమీ బోరా అధిక లాభాలు ఆశజూపి ఎంతోమందిని ఈ స్కాంలోకి దించినట్లు తెలుస్తోంది. సుమీ భర్త తార్కిక్, ఆమె సోదరుడు, సోదరుడి భార్య కూడా ఈ స్కాంలో ఉన్నారు. ఈ కేసులో అందరూ అరెస్టు అయ్యారు. సుమీ కూడా పోలీసులకు లొంగిపోతానని ప్రకటించారు. అయితే తాను నిరపరాధినంటున్నారు సుమీ బోరా. తనపై ఆరోపణలు ఫాల్స్, బేస్‌లెస్ అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
