అక్రమ నిర్మాణం కూల్చివేకుండా స్క్రాప్ వ్యాపారి వినూత్న ఆలోచన.. రాములోరి గుడి కావలిగా మోడీ, యోగీ విగ్రహాలు

|

Jan 31, 2024 | 12:15 PM

ఓ స్క్రాప్ వ్యాపారి తన అక్రమ నిర్మాణ కట్టడాన్ని కూల్చివేత నుంచి కాపాడుకోవడానికి ఒక గొప్ప పరిష్కారాన్ని కనుగొన్నాడు. కూల్చివేయాల్సిన భవనం పై అంతస్తులో ఏకంగా అయోధ్య రామయ్య నే తీసుకుని వచ్చాడు. తన ఇంటి పై అంతస్థులో సీత రామ, లక్ష్మణుల విగ్రహాలతో "గుడి" నిర్మించాడు. అంతేకాదు... ఆ గుడి నిర్మాణాన్ని కూల్చివేయకుండా గుడి బయట ప్రధాన మంత్రి, నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను పోలిన విగ్రహాలను కావాలా పెట్టాడు. కూడా ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. 

అక్రమ నిర్మాణం కూల్చివేకుండా స్క్రాప్ వ్యాపారి వినూత్న ఆలోచన.. రాములోరి గుడి కావలిగా మోడీ, యోగీ విగ్రహాలు
Rooftop Temple
Follow us on

గుజరాత్‌లోని అంక్లేశ్వర్ జిల్లాలో ఓ స్క్రాప్ వ్యాపారి తన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా కాపాడుకునేందుకు ఏకంగా ఆలయాన్ని నిర్మించాడు. భరూచ్-అంక్లేశ్వర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (BAUDA) ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోనుంది. వాస్తవానికి, మోహన్‌లాల్ గుప్తా గత సంవత్సరం కొనుగోలు చేసిన భవనంలో అదనపు అంతస్తును నిర్మించారు. ఇప్పుడు ఈ భవనంపై రాముడు, సీత , లక్ష్మణ విగ్రహాలను కలిపి ఒక దేవాలయాన్ని నిర్మించాడు అంతేకాదు ఆలయం వెలుపల ‘సెక్యూరిటీ గార్డ్స్’ గా ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను పోలి ఉండే విగ్రహాలను ఏర్పాటు చేశారు.

అసలు విషయంలోకి వెళ్తే..

అంక్లేశ్వర్‌లోని గడ్‌ఖోల్ గ్రామంలోని జనతా నగర్ సొసైటీలో నివసిస్తున్న మన్సుఖ్ రక్షియా అనే వ్యక్తి మోహన్‌లాల్ గుప్తాకు చెందిన అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు భవనాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఇదంతా చూసిన మోహన్ లాల్ గుప్తా తన భవనం పైన గుడి కట్టాడు.  ఈ విషయమై తాజాగా ఫిర్యాదులు అందడంతో అధికారులు మంగళవారం స్థలానికి చేరుకుని ఆలయాన్ని నిర్మించిన భవన నిర్మాణాన్ని తనిఖీ చేశారు. అక్రమమ నిర్మాణం అని గుర్తించారు.

దీంతో భరూచ్-అంక్లేశ్వర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (BAUDA) ఇప్పుడు బిల్డింగ్ యజమాని అయిన మోహన్ లాల్ గుప్తాకు అవసరమైన పత్రాలను సమర్పించడానికి  ఏడు రోజుల సమయం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇదే విషయంపై మోహన్ లాల్ గుప్తా మాట్లాడుతూ.. తాను ఈ బిల్డింగ్ ను గత సంవత్సరం జితేంద్ర ఓజా అనే వ్యక్తినుంచి కొనుగోలు చేసినట్లు చెప్పాడు. అంతేకాదు జితేంద్ర అప్పటికే అంటే 2012లో గడ్‌ఖోల్ గ్రామ పంచాయతీ నుండి భవన నిర్మాణ విషయంలో అనుమతి తీసుకున్నాడని చెప్పాడు. కొందరు గిట్టనివారు ఈ ఫిర్యాదు చేశారని గుప్తా ఆరోపిస్తున్నాడు. తాను బిల్డింగ్ లో కొంతమేర పగలగొట్టి..  కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించాడు. అయితే తనపై అసూయతో కొందరు ఆ కట్టడాన్ని కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే డబ్బులు కూడా డిమాండ్ చేశాడని చెప్పాడు. తనను బెదిరించిన వ్యక్తి తమ రిద్ధి సిద్ధి సొసైటీకి దూరంగా రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్నాడని వెల్లడించాడు మోహన్ లాల్.

జూలై 11, 2023 న దాఖలు చేసిన మొదటి ఫిర్యాదు ప్రకారం.. గ్రామంలోని మూడు రెసిడెన్షియల్ సొసైటీలలో గుప్తా సహా మరికొందరి నిర్మాణాలు చట్టవిరుద్ధమని అధికారులు గుర్తించారు. రిద్ధి సిద్ధి రెసిడెన్షియల్ సొసైటీలో గుప్తా రెండంతస్తుల భవనం కాకుండా, అరుణోదయనగర్ సొసైటీలో రామ్‌జీకుమార్ మౌర్య, మరొకటి నిరవ్‌కుంజ్ సొసైటీలో రవి విశ్వకర్మ నిర్మించిన భవనాలు కూడా అక్రమ నిర్మాణాలే అని అధికారులు చెబుతున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..