SBI Debit Card Benefit: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. రోజురోజుకు కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతూ అధిక రాబడి పొందేందుకు కృషి చేస్తోంది. ఎస్‌బీఐలో ఖాతా కలిగిన వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతూ ప్రయోజనం పొందే విధంగా చేస్తోంది. అయితే ఎస్‌బీఐలో ఖాతా కలిగిన వారికి డెబిట్ కార్డు ఉండటం తప్పనిసరి. ఎస్‌బీఐ తన కస్టమర్లకు వివిధ రకాల డెబిట్ కార్డులు అందిస్తోంది. వీటిల్లో ఎస్‌బీఐ రూపే జన్‌ధన్ కార్డు కూడా ఒకటి. ఈ కార్డు ఉన్న వారికి ఒక బెనిఫిట్ ఉంది. అదే ఇన్సూరెన్స్ కవరేజ్. ఉచితంగానే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ యోజన స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా పేదలందరికీ బ్యాంకు ఖాతా అందించాలనే లక్ష్యం పెట్టుకుంది మోదీ సర్కార్. జన్ ధన్ ఖాతాను జీరో బ్యాలెన్స్ ఖాతా అని కూడా చెప్పవచ్చు. అంటే ఇందులో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఛార్జీలు విధించదు. మీరు మీ దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి జన్ ధన్ ఖాతా తెరవచచ్చు. ఐడీ ఫ్రూప్, అడ్రస్ ఫ్రూప్, ఫోటోలు ఇచ్చి ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ జన్ ధన్ ఖాతా కలిగి ఉండటం వల్ల పలు బెనిఫిట్స్ పొందొచ్చు. ఉచిత ఇన్సూరెన్స్‌తోపాటు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఎస్‌బీఐ ద్వారా ఎన్నో పథకాలను అందిస్తోంది. ప్రతి నిరుపేద వాడికి జన్ ధన్ ఖాతా కలిగి ఉండాలనే లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పటికే ఈ జన్ ధన్ ఖాతాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు.
Follow the road to success with Rupay Jandhan Card. It also gets you covered so that you can focus on what matters the most.#JandhanCard #InsuranceCover pic.twitter.com/low5ZhXClq
— State Bank of India (@TheOfficialSBI) April 19, 2021