‘ఆక్సిజన్ సిలిండర్లు కావాలి మహా ప్రభో !’, అన్ని రాష్ట్రాలకూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ

| Edited By: Phani CH

Apr 24, 2021 | 8:56 PM

ఢిల్ఝి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నడూ ఎరుగని దీన స్థితిని ఎదుర్కొంటున్నారు.  కోవిడ్ కేసులు పెరిగిపోవడం, ఆక్సిజన్ కొరత అత్యంత తీవ్రం కావడంతో ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

ఆక్సిజన్ సిలిండర్లు కావాలి మహా ప్రభో !, అన్ని రాష్ట్రాలకూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ
Arvind Kejriwal
Follow us on

ఢిల్ఝి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నడూ ఎరుగని దీన స్థితిని ఎదుర్కొంటున్నారు.  కోవిడ్ కేసులు పెరిగిపోవడం, ఆక్సిజన్ కొరత అత్యంత తీవ్రం కావడంతో ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. మీ వద్దస్పేర్ గా ఉన్న (మిగిలిపోయిన లేదా వాడని) మెడికల్ ఆక్సిజన్ లేదా ఆక్సిజన్ సిలిండర్లు ఉంటే వెంటనే తమకు పంపాలని ఆయన ఈ లేఖల్లో కోరారు. తమ నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిండుకుందని, ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు., మీ దగ్గర స్పేర్ గా ఉన్న ఆక్సిజన్ ను ఇవ్వండి.. కేంద్రం మాకు సహాయ పడుతున్నప్పటికీ అది చాలడం లేదు.. ఉన్న నిల్వలన్నీ అయిపోతున్నాయి అని ఆయన తెలిపారు. మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి లేదని, పైగా తమ నగరంలో అలాంటి ప్లాంట్ ఏదీ కూడా లేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా సరే దయచేసి హెల్ప్ చేయండి అని అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్..ఢిల్లీ ప్రభుత్వం కోరినదానికన్నా తాము ఎక్కువగా ఆక్సిజన్ కోటా ఇచ్చామని, ఇందుకు కేజ్రీవాల్ నిన్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు కూడా తెలిపారని అన్నారు. కోటాను సమయాన్ని బట్టి హేతుబధ్దం చేసుకోవడం, దాన్ని వాడుకునే ప్లాన్ అంతా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.

ఢిల్లీలోని అతి పెద్ద ఆసుపత్రులైన జీటీబీ, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కోవిడ్ రోగులకు ఉద్దేశించిన బెడ్స్ ను సగానికి సగం తగ్గించి వేశాయి. మెడికల్ ఆక్సిజన్ లేక దాదాపు అన్ని ఆసుపత్రులు చేతులెత్తేశాయి. నగరంలో మెడికల్ కేర్ స్తంభించిపోయిందని సోషల్ మీడియాలో ఎస్ ఓ ఎస్ లు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని హాస్పిటల్స్ చీఫ్ లైతే మీడియా వద్ద కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కళ్ళ  ముందే  రోగులు మరణిస్తుంటే తాము నిస్సహాయంగా చూడాల్సి వస్తోందని వాపోతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: వీరికి సెల్యూట్ చేయాల్సిందే.. కోవిడ్‌ డ్యూటీలో నాలుగు నెలల గర్భిణి.. రోజూ 120 మందికి మీల్స్ ఫ్రీ మీల్స్ పంపుతున్న హోట‌ల్ య‌జ‌మాని

Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో