AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Update: ఎల్‌నినో ఉన్నా వర్షాల జోరు.. ముంబై భారీ వర్షాలతో దేశానికి గుడ్ న్యూస్!

India Rainfall Deficit: జూలైలో నైరుతి రుతుపవనాలు బలపడటంతో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. ముంబైతో పాటు పశ్చిమ తీర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో జూన్ చివర్లో 40 శాతంగా ఉన్న లోటు ప్రస్తుతం 17 శాతానికి చేరిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో భారీ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Monsoon Update: ఎల్‌నినో ఉన్నా వర్షాల జోరు.. ముంబై భారీ వర్షాలతో దేశానికి గుడ్ న్యూస్!
India Rainfall Deficit
Rajashekher G
|

Updated on: Jul 10, 2026 | 11:39 AM

Share

Weather Report: ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ, జూలై నెల ప్రారంభంలో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) అనూహ్యంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ముంబైతో పాటు పశ్చిమ తీర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా గణాంకాల ప్రకారం, జూన్ నెలాఖరు నాటికి దేశంలో సాధారణం కంటే దాదాపు 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే జూలై తొలి వారంలో పశ్చిమ తీర ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాల ప్రభావంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 17 శాతానికి తగ్గింది.

పశ్చిమ తీరంలో భారీ వర్షాలు.. మెరుగైన రుతుపవనాల పనితీరు

జూలై తొలి రోజుల్లో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ తీర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో వరదలను సృష్టించాయి. అయితే ఇదే వర్షాలు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయని IMD తెలిపింది. వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొద్ది రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిస్తే, మొత్తం సీజన్ వర్షపాతం గణాంకాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.

వాతావరణ మార్పులతో మారుతున్న రుతుపవనాల స్వభావం

శాస్త్రవేత్తల ప్రకారం, వాతావరణ మార్పులు (Climate Change) భారతీయ రుతుపవనాల స్వభావాన్ని మార్చేస్తున్నాయి. గతంలో అనేక రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేవి. ఇప్పుడు వర్షపు రోజుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. భూమి, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణంలో తేమ నిల్వ సామర్థ్యం పెరుగుతోంది. దీంతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ముంబైలో రికార్డు స్థాయిలో వర్షపాతం

జూలై తొలి వారంలో ముంబైలో పలుమార్లు 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కొలాబా (Colaba) వాతావరణ కేంద్రంలో జూలై 1 నుంచి 7 మధ్య 791 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణంగా మొత్తం జూలై నెలలో కురిసే సగటు వర్షపాతం కంటే ఎక్కువ. సాంటాక్రూజ్ (Santacruz) వాతావరణ కేంద్రంలో ఇదే కాలంలో 879 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఆ ప్రాంతానికి సాధారణంగా జూలై నెలలో నమోదయ్యే సగటు వర్షపాతానికి దాదాపు సమానం.

భారీ వర్షాలకు కారణం ఏమిటి?

వాతావరణ నిపుణుడు మహేష్ పలావత్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి. ఒడిశా మీద ఏర్పడిన అల్పపీడనం, మహారాష్ట్రపై కొనసాగుతున్న చక్రవాత ప్రసరణ, అరేబియా సముద్రం నుంచి నిరంతరం వస్తున్న తేమ కలిసి మహారాష్ట్రలో వరుసగా మేఘాలు ఏర్పడటానికి కారణమయ్యాయి. దీంతో అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

ముంబై, పుణెలో పెరుగుతున్న వర్షపాతం

గణాంకాల ప్రకారం, 1981–2000 కాలంతో పోలిస్తే 2001–2024 మధ్య ముంబైలో సగటు రుతుపవనాల వర్షపాతం సుమారు 15 శాతం పెరిగింది. అదే సమయంలో పుణెలో ఈ పెరుగుదల 23 శాతం వరకు నమోదైంది. భవిష్యత్తులో మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య మరో వారం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాల్సిందే

క్లైమేట్ ట్రెండ్స్ (Climate Trends) డైరెక్టర్ ఆర్తి ఖోస్లా మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల కారణంగా అత్యంత భారీ వర్షాలు మరింత తరచుగా సంభవించే అవకాశముందని తెలిపారు. అందుకే నగరాల అభివృద్ధిలో వాతావరణాన్ని తట్టుకునే మౌలిక వసతులు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థలు, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు, శాస్త్రీయ పట్టణ ప్రణాళికలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.

Follow Us
ఎల్‌నినో ఉన్నా వర్షాల జోరు.. ముంబై భారీ వర్షాలతో దేశానికి గుడ్..
ఎల్‌నినో ఉన్నా వర్షాల జోరు.. ముంబై భారీ వర్షాలతో దేశానికి గుడ్..
యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం నోటీసులు.. స్పందించిన వాట్సాప్..!
యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం నోటీసులు.. స్పందించిన వాట్సాప్..!
పార్క్ చేసిన కార్లకు నిప్పు పెట్టిన దుండగులు.. !
పార్క్ చేసిన కార్లకు నిప్పు పెట్టిన దుండగులు.. !
భారీ స్క్రీన్‌పై వేదమంత్రాలు.. అమెరికాలో ఉంగరాలు మార్చుకున్న జంట
భారీ స్క్రీన్‌పై వేదమంత్రాలు.. అమెరికాలో ఉంగరాలు మార్చుకున్న జంట
మధుమేహులకు భారీ ఊరట.. భారత్ లోకి సరికొత్త ఇన్సులిన్!
మధుమేహులకు భారీ ఊరట.. భారత్ లోకి సరికొత్త ఇన్సులిన్!
నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున..
నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున..
భారత్‌లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్.. ఆస్ట్రేలియాలో ఐపీఎల్ పోరు..!
భారత్‌లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్.. ఆస్ట్రేలియాలో ఐపీఎల్ పోరు..!
భార్యకు చేదు స్మూతీ.. ప్రియురాలితో కాల్స్.. మెసేజ్‌లు డిలీట్..
భార్యకు చేదు స్మూతీ.. ప్రియురాలితో కాల్స్.. మెసేజ్‌లు డిలీట్..
మీ కారు E20 పెట్రోల్‌తో నడుస్తుందా? 4 పద్ధతులతో చెక్‌ చేసుకోండి!
మీ కారు E20 పెట్రోల్‌తో నడుస్తుందా? 4 పద్ధతులతో చెక్‌ చేసుకోండి!
చెత్త ప్రదర్శనకు అసలు కారణం గంభీర్.. ఒలింపిక్స్ నుంచి ఔట్..?
చెత్త ప్రదర్శనకు అసలు కారణం గంభీర్.. ఒలింపిక్స్ నుంచి ఔట్..?