Special Trains: రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 100 ప్రత్యేక రైళ్లు.. ఏయే మార్గాల్లో అంటే

కరోనా సమయంలో భారతీయ రైల్వే రైలు సర్వీసులను నిలిపివేసింది. అయితే కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టిన తర్వాత ముఖ్యమైన మార్గాల్లో రైలు సేవలను పునరుద్దరించింది. క్రమంగా ఈ రైళ్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది. అయినా ప్రస్తుతం వివిధ మార్గాల్లో రైళ్ల రద్దీ కొనసాగుతూనే..

Special Trains: రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 100 ప్రత్యేక రైళ్లు.. ఏయే మార్గాల్లో అంటే
Trains
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 25, 2022 | 7:49 PM

కరోనా సమయంలో భారతీయ రైల్వే రైలు సర్వీసులను నిలిపివేసింది. అయితే కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టిన తర్వాత ముఖ్యమైన మార్గాల్లో రైలు సేవలను పునరుద్దరించింది. క్రమంగా ఈ రైళ్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది. అయినా ప్రస్తుతం వివిధ మార్గాల్లో రైళ్ల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా రైళ్లు ఉండకపోవడంతో నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో 100 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలో 100 ప్రత్యేక రైళ్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ కొనసాగుతుండటంతో ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించారు. నవంబర్‌ నుంచి డిసెంబర్‌ చివరి వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. తిరుపతి -ఔరంగాబాద్‌, తిరుపతి-అకోలా, హైదరాబాద్‌ -తిరుపతి, కాజీపేట-తిరుపతి , విజయవాడ-నాగర్‌ సోల్‌, కాకినాడటౌన్‌-లింగంపల్లి, మచిలీపట్నం-సికింద్రబాద్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. మొత్తం అన్ని మార్గాల్లో నడపనున్న సర్వీసులతో కలిపి దాదాపు వంద ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది.

రైలు నెంబర్ 07637 తిరుపతి -ఔరంగాబాద్‌ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. నవంబర్‌ 6వ తేదీ నుంచి నవంబర్‌ 27వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఈ రైలును తిరుపతి నుంచి నడుపనున్నారు. మొత్తం నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

రైలు నంబర్‌ 07638 ఔరంగబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు ప్రతి సోమవారం ఔరంగాబాద్‌లో బయలుదేరుతుంది. నవంబర్‌ 7వ తేదీ నుంచి 28 తేదీ మధ్య వారానికి ఒక సారి ప్రతి సోమవారం ఈ రైలు నడవనుంది. మొత్తం నాలుగు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

రైలు నంబర్ 07605 తిరుపతి-అకోలా మధ్య ప్రతి శుక్రవారం తిరుపతిలో బయలుదేరుతుంది. నవంబర్‌ నాలుగు నుంచి డిసెంబర్‌ 31 వరకు ఈప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం, రెండు నెలల్లో 9 సార్లు నడపనున్నారు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు నెంబర్ 07606గా అకోలా-తిరుపతి మధ్య ప్రతి ఆదివారం నడుస్తుంది. నవంబర్‌ 6 నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

రైలు నంబర్‌ 07643 హైదరాబాద్‌ – తిరుపతి మధ్య ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడువనుంది. నవంబర్‌ 7వ తేదీ నుంచి నవంబర్‌ 28వ తేదీ వరకు నెలలో నాలుగు ప్రత్యేక సర్వీసులు భారతీయ రైల్వే నడపనుంది. తిరుగు ప్రయాణంలో 07644 నంబరుతో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఈ రైలును నడపనున్నారు. ప్రతి మంగళవారం ఈ రైలు తిరుపతిలో బయలుదేరుతుంది.

రైలు నంబర్‌ 07698 విజయవాడ-నాగర్‌ సోల్‌ మధ్య ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం నడువనుంది. నవంబర్‌4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ రైలును నడుపుతారు. తిరుగు ప్రయాణంలో 07699 నంబరుతో ప్రతి శనివారం నాగర్‌సోల్‌-విజయవాడ మధ్య ఈ రైలు నడువనుంది. నాగర్‌సోల్‌లో ప్రతి ఆదివారం ఈ రైలు బయలుదేరుతుంది.

రైలు నంబర్‌ 07091 కాజీపేట – తిరుపతి మధ్య ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు నడవనుంది. నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 27వరకు ఈ రైలును రెండు నెలల పాటు 8 సర్వీసులు నడుపనున్నారు. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 07092తో తిరుపతి కాజీపేట మధ్య ప్రతి మంగళవారం తిరుపతిలో ఈ రైలు బయలుదేరుతుంది.

రైలు నంబర్‌ 07141 కాకినాడటౌన్‌-లింగంపల్లి మధ్య వారంలో మూడు సార్లు అంటే ప్రతి మంగళవారం, బుధవారం, శుక్రవారాల్లో నవంబర్‌ 3 నుంచి డిసెంబర్‌ వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతారు. నెలలో మొత్తం 13 ప్రత్యేక రైళ్లను కాకినాడ-లింగం పల్లి మధ్య నడుపనున్నారు. తిరుగు ప్రయాణంలో 07142 నంబరుతో లింగంపల్లి-కాకినాడ మధ్య మంగళవారం, గురువారం, శనివారం మధ్య నవంబర్ 3 నుంచి డిసెంబర్‌ 1 వరకు 13సర్వీసులు నడుపనున్నారు.

రైలు నంబర్‌ 07185 మచిలీపట్నం-సికింద్రబాద్‌ ప్రత్యేక రైలు నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్‌ 25 వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడవనుంది. రెండు నెలల్లో 8 ప్రత్యేక సర్వీసులు నడుపనున్నారు. తిరుగు ప్రయాణంలో 07186 నంబరుతో సికింద్రబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రతి ఆదివారం ఈ రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..