National Herald Case: ఈడీ ముందుకు సోనియా హాజరు.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన..

|

Jul 21, 2022 | 12:33 PM

ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో..

National Herald Case: ఈడీ ముందుకు సోనియా హాజరు.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన..
Congress Protest
Follow us on

ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ప్రశ్నించనుంది. సోనియా గాంధీ ఈడీ కార్యాలయంలో మరికాసేపట్లో విచారణకు హాజరయ్యారు. సోనియా వెళుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ర్యాలీగా బయల్దేరారు. దేశ వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీంతోపాటు పార్లమెంట్‌లోపల, భయటన కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు.

ఢిల్లీలో జంతర్ మంతర్ సమీపంలో ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నందుకు పోలీసులకు ఆ పార్టీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. సోనియా వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ నిరసనలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విరుచుకుపడ్డారు.  తప్పు చేయనప్పుడు భయపడటం ఎందుకు అని ప్రశ్నించారు. మరో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడుతూ.. ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ నిరసనలు చేస్తోందని అన్నారు. అయితే సోనియా, రాహుల్ గాంధీల తరఫున ఈ విచారణకు కారణాన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు ఇప్పటికైనా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

దేశ వ్యాప్త నిరసనలు..

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మద్దతుగా ఢిల్లీ, పాట్నా, లక్నో సహా దేశంలోని ఇతర నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు.


ఇదిలావుంటే..ఈడీ ఎదుట సోనియా గాంధీ హాజరుకావడానికి ముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం తన నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఈ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు.


ఈడీ ఎదుట సోనియా గాంధీ హాజరుకావడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.