చెన్నై, జులై 20: తండ్రిని డబ్బులడిగితే ఇవ్వలేదనీ కొడుకు సొంత ఇంటిపైనే బాంబ్ దాడి చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని వేలచ్చేరి భారతీనగర్‌లో పనీర్‌సెల్వం (60) అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే ఆ ప్రాంతంలో కొద్దిపాటి భూమిని విక్రయించాడు. డబ్బు చేతికి అందగానే అందులో తనకు రూ.3 లక్షలు కావాలని పనీర్ సెల్వం కొడుకు అరుణ్ కోరాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో అరుణ్ కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి అరుణ్ తన బావ ప్రవీణ్‌తో కలిసి ఇంటిపై పేలుడు పదార్ధం విసిరాడు. ఈ ఘటనలో ప్రవీణ్ సోదరి రేఖ, మేనమామ వెట్రివేందన్ తీవ్రంగా గాయపడ్డారు.
కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు పెరుంబాక్కం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేయగా వారి ఇంట్లో మరో నాలుగు బాంబులు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు బైక్‌పై వచ్చి బాంబులు విసిరి పరారైనట్లు తెలిసింది. నిందితులు అరుణ్, ప్రవీణ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.