భయంకరమైన విషసర్పాల కంటే కరోనా మహా డేంజర్ అని అర్థమవుతోంది.. వేల కొద్దీ విషసర్పాలను అవలీలగా పట్టుకునే నేర్పరితనం ఉన్న స్టాన్లీ ఫెర్నాండేజ్ సూక్ష్మాతి సూక్ష్మమైన కరోనా వైరస్‌కు బలయ్యారు. ఆయన ధీరత్వానికి పాములు ఏమీ చేయలేకపోయాయి కానీ కరోనా మాత్రం కాటేసింది. చెన్నై దగ్గర అంబత్తూరు కల్లికుప్పంకు చెందిన 62 ఏళ్ల స్టాన్లీ ఫెర్నాండేజ్ టీవీ ఛానెళ్లలో కెమెరామన్‌గా పని చేసేవారు.. రిటైర్ అయ్యిన తర్వాత పాములు పట్టడం అనే వృత్తిని చేపట్టారు. నిజానికి ఆయనకు చిన్నప్పట్నుంచే పాములు పట్టే అలవాటు ఉంది.. ఆ చాకచక్యమూ ఉంది. అందుకే ఆయన స్నేక్ స్టాన్లీగా సుప్రసిద్ధులయ్యారు. చెన్నై నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారు ఫోన్ చేస్తే చాలు చటుక్కున వాలిపోయేవారు. ఇళ్లలో, ఆఫీసుల్లో ఉన్న పాములను నేర్పుగా పట్టుకునేవారు.. ఏ మాత్రం బెదురు కనిపించేవారు కాదు. ఈయనకు అటవీ, అగ్నిమాపక శాఖల అధికారులు కూడా ఎంతో సహకరించేవారు. పాతికేళ్లలో ఓ పదివేలకు పైగా విష సర్పాలను పట్టుకుని ఉంటారాయన! ఆరు పదుల వయసులోనూ అదే ఉత్సాహాన్ని చూపేవారు.. ఎందుకీ కష్టం.. హాయిగా ఇంట్లో ఉండరాదా అంటే .. ఇది మాత్రం సమాజసేవ కాదా అని జవాబిచ్చేవారు స్నేక్ స్టాన్లీ.. ఇంత గట్టి మనిషికి, ఇంత సాహసవంతుడికి అయిదు రోజుల కిందట కరోనా సోకింది. పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ అవ్వడంతో వెంటనే చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆకాశం నుంచి ఎలుకల వర్షం వట్టి భ్రమేనా..?? అసలు విషయమేమిటంటే… ( వీడియో )
Pizza on Volcano: అగ్నిపర్వతం లావాపై పిజ్జా తయారు చేసిన వ్యక్తి..( వీడియో )