Watch Video: నిద్రిస్తున్న వ్యక్తిపైకెక్కిన పాము.. భయంతో ఆతను చేసిన పనికి డాక్టర్లు కూడా షాక్.. ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లా ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. నిద్రిస్తున్న సమయంలో తనను కరిచేందుకు వచ్చిన ఒక విషపూరిత పామును వ్యక్తి చేతితో పిసికి చంపేశాడు. మొదట పామును చూసి భయపడిపోయిన అతడు.. ఆ భయంలోనే పాము మూతిని అరగంట పాటు గట్టిగా పట్టుకొన్నాడు. దీంతో ఆ పాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లా నుండి ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు నిద్రిస్తున్న సమయంలో ఒక నాగుపాము అతనిపై ఎక్కింది. ఆ పామును చూసిన వ్యక్తి ఒక్కసారిగా భయపడిపోయాడు. ఇక చేసేదేమి లేక తనను తాను రక్షించుకునేందుకు పామును మూతిని గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు ఆరగంట పాటు ప్రాణాలు చేతితో పెట్టుకొని ఆలాగే పామును బిగించి పట్టుకున్నాడు. దీంతో పాము అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ సంఘటన లలిత్‌పూర్ జిల్లాలోని మాదవర పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని టిస్గానా గ్రామంలో జరిగింది. ఆ పాము చనిపోయిన తర్వాత ఘటన నుంచి తేరుకున్న యువకుడు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ జరిగింది చెప్పి తనను కాపాడాలంటూ వైద్యులను వేడుకున్నాడు. దీంతో అతన్ని పరీక్షించిన వైద్యులు.. తన శరీరంలో ఎలాంటి విషాన్ని గుర్తించలేదు. ఇదే విషయాన్ని సదురు వ్యక్తి వైద్యులు తెలిపారు. తనకు ఎలాంటి పాము కాటువేయలేదని.. తన ఆరోగ్యం సురక్షితంగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
అయితే ఇందుకు సంబంధించి దృశ్యాలు మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
