Smriti Irani vs Rahul Gandhi: పార్లమెంట్‌లో రాహుల్‌ ఫ్లయింగ్ కిస్‌ అలజడి.. స్పీకర్‌కు 21 మంది మహిళా ఎంపీల ఫిర్యాదు..

Smriti Irani vs Rahul Gandhi: సభలో ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తున్న రాహుల్‌గాంధీ మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇవ్వడం దారుణమన్నారు స్మృతి ఇరానీ. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింభిస్తుందన్నారు. గాంధీ కుటుంబంలోని వ్యక్తులే ఇలా ప్రవర్తిస్తారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్మృతి ఇరానీ. రాహుల్‌ ప్రవర్తన రోడ్డు మీద పోకిరీల లాగా ఉందంటూ ఫైర్ అయ్యారు.

Smriti Irani vs Rahul Gandhi: పార్లమెంట్‌లో రాహుల్‌ ఫ్లయింగ్ కిస్‌ అలజడి.. స్పీకర్‌కు 21 మంది మహిళా ఎంపీల ఫిర్యాదు..
Rahul Gandhi Smriti Irani

Updated on: Aug 09, 2023 | 3:33 PM

Smriti Irani vs Rahul Gandhi: అనర్హత వేటు నుంచి తప్పించుకుని ఏదోలా లోక్‌సభలో అడుగుపెట్టిన కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీను అనూహ్యంగా ఓ వివాదం చుట్టుముట్టింది. ఆయన గాల్లోకి వదిలిన ఓ ఫ్లైయింగ్ కిస్ ఇప్పుడు పార్లమెంట్‌లో అలజడికి దారితీసింది. ఆ కిస్‌ తనవైపు తిరిగే ఇచ్చారన్నది ఎంపీ స్మృతి ఇరానీ చెబుతున్న మాట. ఏకంగా మహిళా ఎంపీలంతా కలిసి స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. రాహుల్‌పై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.. స్మృతి ఇరానీ వైపు చూసి రాహుల్‌ ఫ్లయింగ్ కిస్‌ ఇచ్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 21 మంది బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అవిశ్వాస తీర్మానంపై రాహుల్‌గాంధీ సభలో మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వైపు చూస్తూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారని.. చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు.

సభలో ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తున్న రాహుల్‌గాంధీ మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇవ్వడం దారుణమన్నారు స్మృతి ఇరానీ. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింభిస్తుందన్నారు. గాంధీ కుటుంబంలోని వ్యక్తులే ఇలా ప్రవర్తిస్తారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్మృతి ఇరానీ. రాహుల్‌ ప్రవర్తన రోడ్డు మీద పోకిరీల లాగా ఉందంటూ ఫైర్ అయ్యారు. పార్లమెంట్‌లో ఇంతటి స్త్రీ ద్వేషాన్ని ఎన్నడూ చూడలేదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ప్రజల సభ – స్త్రీల గౌరవాన్ని కాపాడటానికి చట్టాలు చేసే సభలో ఇలా ప్రవర్తించడం ఏంటంటూ విమర్శించారు.

రాహుల్ గాంధీ ప్రసంగానికి ప్రతిస్పందిస్తూ, మణిపూర్‌లో ప్రభుత్వం “భారత మాతను (భారతదేశం)” చంపిందని కాంగ్రెస్ ఎంపీ చేసిన ఆరోపణలపై ఇరానీ ఆగ్రహం వ్యక్తంచేశారు.. ఎవరైనా ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి అని ఆమె అన్నారు. భారతదేశ హత్య గురించి ఎవరైనా మాట్లాడటం ఇదే తొలిసారి.. కానీ, కాంగ్రెస్ నేతలు బల్లాలపై కొడుతూ కనిపించారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో బీజేపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ అమిత్ మాల్వియా.. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ చేశారంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

అమిత్ మాల్వియా షేర్ చేసిన ట్విట్..

పార్లమెంట్‌లో ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదన్నారు కేంద్రమంత్రి శోభా కరంద్లజే . పార్లమెంట్‌లో ఎంపీగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించిన ఘటన తొలిసారి జరిగిందన్నారు.

కాగా.. బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడారు. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్.. “మణిపూర్ రెండుగా చీలిపోయింది. ప్రభుత్వ రాజకీయాలు ఆ రాష్ట్రంలో భారతదేశాన్ని హత్య చేశాయి. మీరు భారత మాతకు రక్షకులు కాదు, హంతకులు” అంటూ విమర్శించారు. జాతి వాణిని వినడానికి, మనం అహంకారం, ద్వేషాన్ని విడిచిపెట్టాలి.. అంటూ సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..