కరోనాకు చెక్.. చెన్నైలో స్పెషల్ డ్రైవ్.. 16 వేల మంది వర్కర్లతో ఇంటింటి స్క్రీనింగ్

కరోనా నివారణకు తమిళనాడు ప్రభుత్వం ప్రధానంగా చెన్నైలో స్పెషల్ డ్రైవ్ చేబట్టింది. ఇంటింటి స్క్రీనింగ్ కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తమ శిక్షణ పొందిన 16 వేలమంది సిబ్బందిని నియమించింది.

కరోనాకు చెక్.. చెన్నైలో స్పెషల్ డ్రైవ్.. 16 వేల మంది వర్కర్లతో ఇంటింటి స్క్రీనింగ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 05, 2020 | 12:45 PM

కరోనా నివారణకు తమిళనాడు ప్రభుత్వం ప్రధానంగా చెన్నైలో స్పెషల్ డ్రైవ్ చేబట్టింది. ఇంటింటి స్క్రీనింగ్ కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తమ శిక్షణ పొందిన 16 వేలమంది సిబ్బందిని నియమించింది. వీరంతా ఆదివారం నుంచే ఇంటింటి స్క్రీనింగ్ చేపట్టడం ప్రారంభించారు. పర్సనల్ ప్రొటెక్టివ్ సూట్లు వగైరా ధరించిన ఈ సిబ్బంది అంతా ఎప్పటికప్పుడు ప్రతి రోజూ తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సిటీలో ఎవరెవరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారన్నది కూడా వీరి స్క్రీనింగ్ లో భాగమని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సిబ్బందిలో చాలామంది స్వయం సహాయక బృందాలవారని, వచ్ఛే 90 రోజుల్లో వీరు  సుమారు 10 లక్షల ఇళ్ళు , భవనాలలోని ప్రజలకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

తమిళనాడులో శనివారం నాటికి మరో రెండు కరోనా డెత్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రం నుంచి ఢిల్లీలో జరిగిన తబ్లీఘీ జమాత్ ఈవెంట్ కి వెళ్లిన 73 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కన్ఫార్మ్ అయిన కేసుల సంఖ్య 485 కి పెరిగింది. మహారాష్ట్ర (635) తరువాత ఇది రెండో రాష్ట్రమైంది. ఇప్పటివరకు తమిళనాడులో 4,248 సాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేశారు. సుమారు లక్ష మంది హోం ఐసోలేషన్ లో ఉండగా, 1681 మంది హాస్పిటల్ ఐసోలేషన్ లో ఉన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు