కరోనాపై నిర్లక్ష్యం తగదు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

కరోనా వైరస్ వల్ల తలెత్తే ముప్పును మీరు ఎదుర్కొనజాలరని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ప్రజలను హెచ్చరించారు. ఈ మహమ్మారి నుంచి తాము క్షేమంగా ఉన్నామని ఎవరూ తప్పుడు అభిప్రాయం..

కరోనాపై నిర్లక్ష్యం తగదు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Apr 05, 2020 | 1:45 PM

కరోనా వైరస్ వల్ల తలెత్తే ముప్పును మీరు ఎదుర్కొనజాలరని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ప్రజలను హెచ్చరించారు. ఈ మహమ్మారి నుంచి తాము క్షేమంగా ఉన్నామని ఎవరూ తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోరాదన్నారు. ‘న్యూయార్క్ నగరాన్ని చూడండి.. ఎంతోమంది ధనికులున్న ఆ సిటీ పరిస్థితిని గమనించండి’ అని ఆయన అన్నారు. అయితే ఈ సవాలును తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని, సమర్థంగా ఈ సమస్య నుంచి బయటపడగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. లాహోర్ లో కరోనా రోగులకు సంబంధించి  పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ఇమ్రాన్ ఖాన్ అక్కడి ఆసుపత్రిని సందర్శించారు. ఈ ఆసుపత్రిలో వెయ్యి మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. శనివారం నాటికి పాకిస్తాన్ లో 2,818 కరోనా కేసులు నమోదు కాగా.. 41 మంది మరణించారు. ఈ కరోనా ఎప్పుడు విజృంభిస్తుందో, ఎలా నష్టం కలగజేస్తుందో ఎవరికీ తెలియదని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను రక్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు.

అటు- దేశవ్యాప్త లాక్ డౌన్ కు అవకాశాలను ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు వంటివాటిని మూసివేసినప్పటికీ.. వ్యవసాయ, నిర్మాణ రంగాలను మినహాయించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ నెలాఖరు నాటికి దేశంలో కరోనా రోగుల సంఖ్య 50 వేలకు చేరుకోవచ్చునని పాక్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన తమ నివేదికలో తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu