జార్ఖండ్‌లో ఓ బాలుడికి పోలియో లక్షణాలు, ఐఐఎస్‌కు శాంపిల్స్
పోలియో మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేశాం.. అయినా కానీ జార్ఖండ్‌లో ఓ ఆరేళ్ల బాలుడికి పోలియో లక్షణాలు ఉన్నాయేమో అన్న అనుమానం డాక్టర్లకు కలిగింది..

పోలియో మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేశాం.. అయినా కానీ జార్ఖండ్‌లో ఓ ఆరేళ్ల బాలుడికి పోలియో లక్షణాలు ఉన్నాయేమో అన్న అనుమానం డాక్టర్లకు కలిగింది.. ఇటీవల ఆ బాలుడు ఆనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరాడు.. ఆ బాలుడికి చికిత్స అందించిన వైద్యులకు పోలియో లక్షణాలు ఉన్నట్లు అనుమానం కలిగింది. ఎందుకైనా మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యకర్తకు విషయం చేరవేశారు.. మొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యకర్త వచ్చి బాలుడి నుంచి శాంపిల్స్ సేకరించారు.. వ్యాధి నిర్ధారణ కోసం కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు పంపారు. రిజల్ట్స్ రావడానికి పదిహేను రోజులు పడుతుంది.. పరీక్షలో పోలియో కాకపోతే ఆనందం.. అప్పుడు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితికి గల కారణాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వెల్లడిస్తుంది. ఒకప్పుడు పోలియో మన దేశంలో అనేకమంది జీవితాలను నాశనం చేసింది.. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఈ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టగలిగింది.. 2014లో డబ్ల్యూహెచ్‌వో భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది కూడా! 2018లో కూడా 13 కేసులను పోలియోగా అనుమానించారు.. ఆ మరుసటి ఏడాది 32 కేసులను పోలియోనేమో అన్న అనుమానంతో పరీక్షలను నిర్వహించారు. వీటిల్లో ఒకటి కూడా పోలియో పాజిటివ్‌గా నిర్ధరణ కాకపోవడం శుభపరిణామం!
