సియాచిన్‌లో విరిగిపడ్డ మంచు చరియలు.. ఆరుగురు మృతి!

|

Nov 19, 2019 | 12:26 AM

లఢక్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. సియాచిన్‌‌లోని ఆర్మీ బేస్‌పై మంచు చరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది మంచు కింద చిక్కుకుపోయారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమానీనదం వద్ద ఈ ఘటన సంభవించింది. ఇక మంచులో కూరుకుపోయిన వాళ్ళను బయటికి తీయడం కోసం ఆర్మీ సహాయక చర్యలు చేపట్టారు. కాగా, నలుగురు సైనికులు, ఇద్దరు పోర్టర్లు చలికి తట్టుకోలేక తేలికపాటి అల్పోష్ణస్థితి(మైల్డ్‌ హైపోథెర్మియా)కి గురి కావడంతో మృత్యువాత […]

సియాచిన్‌లో విరిగిపడ్డ మంచు చరియలు.. ఆరుగురు మృతి!
Follow us on

లఢక్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. సియాచిన్‌‌లోని ఆర్మీ బేస్‌పై మంచు చరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది మంచు కింద చిక్కుకుపోయారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమానీనదం వద్ద ఈ ఘటన సంభవించింది. ఇక మంచులో కూరుకుపోయిన వాళ్ళను బయటికి తీయడం కోసం ఆర్మీ సహాయక చర్యలు చేపట్టారు. కాగా, నలుగురు సైనికులు, ఇద్దరు పోర్టర్లు చలికి తట్టుకోలేక తేలికపాటి అల్పోష్ణస్థితి(మైల్డ్‌ హైపోథెర్మియా)కి గురి కావడంతో మృత్యువాత పడ్డారని ఇండియన్ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది.