AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు వేరువేరు ఎన్‌కౌంటర్లలో.. ఆరుగురు నక్సల్స్ హతం

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం శనివారం కాల్పులతో మార్మోగింది. మొత్తం మూడు వేర్వేరు ప్రాంతాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. పోలీసులు కూంబింగ్ చేపడుతున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. సుకుమా జిల్లా పరిధిలోని తాడ్‌మెట్ల వద్ద మావోయిస్టులు రోడ్డును తవ్వినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ బలగాలు పెట్రోలింగ్‌ చేపట్టాయి. ఈ సమయంలో శనివారం సాయంత్రం 6గంటల సమయంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. […]

మూడు వేరువేరు ఎన్‌కౌంటర్లలో.. ఆరుగురు నక్సల్స్ హతం
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 15, 2019 | 8:43 AM

Share

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం శనివారం కాల్పులతో మార్మోగింది. మొత్తం మూడు వేర్వేరు ప్రాంతాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. పోలీసులు కూంబింగ్ చేపడుతున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. సుకుమా జిల్లా పరిధిలోని తాడ్‌మెట్ల వద్ద మావోయిస్టులు రోడ్డును తవ్వినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ బలగాలు పెట్రోలింగ్‌ చేపట్టాయి. ఈ సమయంలో శనివారం సాయంత్రం 6గంటల సమయంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు నక్సల్స్‌ హతమయ్యారు. ఇక బీజాపూర్‌ జిల్లా పున్నూర్‌ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో నక్సలైట్‌ హతమయ్యాడు. దంతెవాడ జిల్లా కుత్రెం అటవీ ప్రాంతంలో కూడా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ హతమయ్యారు. వారి తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులే!" - ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?