Jharkhand: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు దుర్మరణం.. 40 మందికి పైగా..

|

Sep 17, 2022 | 7:54 PM

బస్సు నదిలోకి (Bus Falls Into River) దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Jharkhand: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు దుర్మరణం.. 40 మందికి పైగా..
Jharkhand
Follow us on

Jharkhand Hazaribag Accident: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు నదిలోకి (Bus Falls Into River) దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గిరిదిహ్ జిల్లా నుండి రాంచీ వెళ్తున్న బస్సు తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాని నదిలో బస్సు పడిపోయింది. బస్సు అదుపుతప్పి వంతెన రెయిలింగ్‌ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ రతన్ చోతే తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. వాహనంలో కొంత మంది చిక్కుకుపోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. వాహనంలో పలువురు చిక్కుకుపోగా, గ్యాస్ కట్టర్ సాయంతో వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

గాయపడిన వారిని హజారీబాగ్‌లోని షేక్ భిఖారీ మెడికల్ కాలేజీలో చేర్పించారు. సమాచారం ప్రకారం.. ప్రజలందరూ రాంచీలో ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయిందని పేర్కొంటున్నారు.

Hazaribag Accident

కొందరికి తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..