మావోయిస్టుల్లో క‌లిసిపోతానంటూ రాష్ట్ర‌ప‌తికి శిరోముండ‌నం బాధితుడి లేఖ

మావోయిస్టుల్లో క‌లిసిపోతానంటూ రాష్ట్ర‌ప‌తికి శిరోముండ‌నం బాధితుడి లేఖ

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌‌మండ్రి అర్బ‌న్ సీతా న‌గ‌రంలోని వెదుళ్ల‌ప‌ల్లిలో పోలీస్ స్టేష‌న్‌లో శిరోముండ‌నం చేసిన‌ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఎస్ఐ ఫిరోజ్‌తో పాటు ఓ కానిస్టేబుల్‌ని కూడా సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 5:50 PM

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌‌మండ్రి అర్బ‌న్ సీతా న‌గ‌రంలోని వెదుళ్ల‌ప‌ల్లిలో పోలీస్ స్టేష‌న్‌లో శిరోముండ‌నం చేసిన‌ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఎస్ఐ ఫిరోజ్‌తో పాటు ఓ కానిస్టేబుల్‌ని కూడా సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా న‌మోదు చేశారు. ఇసుక లారీల‌ను అడ్డుకున్నందుకు త‌న‌పై దాడి చేశార‌ని బాధితుడి అప్ప‌ట్లో ఆరోపించాడు. పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లిన పోలీసులు త‌న‌ను తీవ్రంగా కొట్టి శిరోముండ‌నం చేశార‌ని తెలిపాడు. దీంతో ఈ విష‌యం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే.

కాగా ఇప్పుడు ఈ కేసులో బాధితుడు ప్ర‌సాద్ త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేదంటూ రాష్ట్రప‌తికి లేఖ రాశాడు. శిరోముండ‌నం కేసులో నిందితులంద‌ర్నీ అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేసిన ఆయ‌న అలా చేయ‌ని ప‌క్షంలో మావోయిస్టుల్లో క‌లిసిపోవ‌డానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరాడు ప్ర‌సాద్. దీంతో ఈ విష‌యం మారో మారు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read More: 

ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డేః ఫ్యాన్స్‌కు ‘వ‌కీల్ సాబ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్’

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌

మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ క‌న్నుమూత‌..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu