Oxygen Tankers: ఆపద కాలంలో స్నేహవారధిగా నిలిచింది సింగపూర్. మిత్రదేశంగా భారత్‌కు ఎనిమిది క్రయోజినిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3,898 ఆక్సిజన్ సిలండర్లు సహా వైద్య పరికరాలను సమకూర్చింది. ఈ నెల 5వ తేదీన సింగపూర్ నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్ ఐరావత్ నౌక ఇవాళ విశాఖకు చేరింది. ఆపరేషన్ సముద్ర సేతు-2లో భాగంగా కోవిడ్ రిలీఫ్ మిషన్‌లో తొమ్మిది నౌకలు సేవలందిస్తున్నాయి. ఈ నౌకలు.. గల్ఫ్, ఆగ్నేయాసియాలోని పలు మిత్రదేశాల నుంచి మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్‌ను, కరోనా కట్టడిలో భాగంగా ఆధునాతన వైద్య పరికరాలను భారత్‌కు చేరవేస్తున్నాయి. ఐఎన్ఎస్ ఐరావత్.. సింగపూర్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను, సిలండర్లను సోమవారం విశాఖకు చేర్చింది. కరోనా కష్టకాలంలో ఇండియన్ నేవీ సమర్థవంతమైన సేవలందిస్తోంది.
ఇక నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద చర్యలకు ఉపక్రమించింది. డాక్టర్ భన్సోడి, ఇంజినీర్లు శివకుమార్, సత్యనారాయణలతో కూడా నేవీ బృందం తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రులను సందర్శించారు. కోవిడ్ సెంటర్లలో ఆక్సిజన్ ట్యాంకులను, పైప్‌లైన్లను పరిశీలించారు. ఆక్సిజన్ అవసరం ఏమేరకు వుంది, ఆక్సిజన్ నిల్వలు వృధా కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో క్షుణ్ణంగా పరిశీలించారు అధికారులు. ఆక్సిజన్ నిర్వహణలో లోపాలను సరిదిద్దేందుకు నేవీ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
Also read: