Earthquake: సిక్కింలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు

|

Jan 05, 2022 | 11:43 AM

Earthquake: ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. మన దేశంలో వచ్చే భూకంపాలు పెద్దగా నష్టం ఉండదు. ఇతర దేశాల్లో వచ్చే భూకంపాల వల్ల భారీ..

Earthquake: సిక్కింలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
Follow us on

Earthquake: ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. మన దేశంలో వచ్చే భూకంపాలు పెద్దగా నష్టం ఉండదు. ఇతర దేశాల్లో వచ్చే భూకంపాల వల్ల భారీ ఎత్తున నష్టం సంభవిస్తుంటుంది. ఇక తాజాగా దక్షిణ సిక్కింలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవాజామున చోటు చేసుకున్న భూకంపం రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.7గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ఒక ప్రకటనలో తెలిపింది.

తెల్లవారు జామున 3.01 గంటల సమయంలో భూమి కంపించిందని పేర్కొంది. సిక్కింలోని రావన్‌గ్లా ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్‌సీఎస్‌ అధికారులు తెలిపారు. రావన్‌గ్లాలోని భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతున ఈ భూప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు. రాత్రి సమయంలో భూ ప్రకంపనలు రావడంతో ఇళ్లలోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం ఇంకా అందలేదని అధికారి తెలిపారు.

 

ఇవి కూడా చదవండి:

Railway Station: కొన్ని రైల్వే స్టేషన్‌లను సెంట్రల్‌, టెర్మినల్‌ అని పేర్లతో ఎందుకు పిలుస్తారు..?

Sankranti Special Trains: సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే