Plants Sapling: సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి.. రోజూ ఒక మొక్క నాటుతా..!
Plants Sapling: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అందరికి మేలు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. వాతావరణంలో మార్పు కోసం ప్రతి రోజూ..
Plants Sapling: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అందరికి మేలు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. వాతావరణంలో మార్పు కోసం ప్రతి రోజూ ఒక మొక్క నాటాలని ఆయన డిసైడ్ అయ్యారు. ప్రజలు ఏడాదికి కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని శివరాజ్ పిలుపునిచ్చారు.
వాతావరణ మార్పులు భూమికి ముప్పు గా పరిణామించాయి.. పర్యావరణాన్ని పరిరక్షణకు మనము నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలిసన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. నేను రోజు ఒక మొక్క నాటుతాను.. మీరు కనీసం సంవత్సరంలో ఒక మొక్క అయినా నాటాలలి ప్రజలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పిలుపునిచ్చారు. భోపాల్‌లోని సెక్రటేరియట్ శివరాజసింగ్ చౌహాన్ స్వయంగా మొక్క నాటారు.
దేశ వ్యాప్తంగా వాతావరణ లో వస్తున్న మార్పుల పై తీవ్రంగా ఆలోచించాలిసిన అవసరం ఉందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. నర్మదా నది తీరంలో లక్షలాదిమొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. అంతేకాకుండా స్కూల్ విద్యార్ధులను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేశారు.
భోపాల్‌గ్యాస్ లాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందంటున్నారు శివరాజ్‌సింగ్ చౌహాన్ . ఆనాటి ఘటన నుంచి ఇప్పటికి కూడా వేలాదిమంది కోలుకోలేదని అన్నారు. అందుకే పర్యావరణ పరిరక్షణ .. చెట్లను నాటే కార్యక్రమాన్ని ఓ యుద్దంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. చెట్లను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు శివరాజ్‌సింగ్ చౌహాన్.
తాను రోజు కు ఒక మొక్క నాటుతానని నిర్ణయం తీసుకోని వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం కృషి చేస్తామని తెలిపిన మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో కూడా హరితహారం కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతోందని తెలిపారు. ప్రకృతిని కాపాడడానికి అందరూ కృషి చేయాలని ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
Monkey Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కోతి చేసిన పని.. ఇలా కూడా చేస్తాయా అంటూ నెటిజన్ల కామెంట్స్.. యూఎస్ లో గ్రీన్ కార్డులు కోరేవారికి శుభవార్త ! త్వరలో రానున్న కొత్త చట్టం, బైడెన్ సంతకమే తరువాయి
Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..