CAR ACCIDENT : యాక్సిడెంట్ చేసి మృతదేహంతో దాదాపు 10 కిలో మీటర్ల ప్రయాణం… చివరకు
అతివేగం ప్రమాదకరం.. వేగంగా వాహనాలు నడిపితే పోతావ్ అంటూ ఎన్ని విధాలుగా హెచ్చరించినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు కొందరు వాహనదారులు. వాళ్లు నడిపిది కారైనా.. ఏదో విమానం నడుపుతున్నట్లు ఫీలై.. బొక్కబోర్ల పడుతుంటారు.
CAR ACCIDENT : అతివేగం ప్రమాదకరం.. వేగంగా వాహనాలు నడిపితే పోతావ్ అంటూ ఎన్ని విధాలుగా హెచ్చరించినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు కొందరు వాహనదారులు. వాళ్లు నడిపిది కారైనా.. ఏదో విమానం నడుపుతున్నట్లు ఫీలై.. బొక్కబోర్ల పడుతుంటారు. ఇక మరికొన్ని సార్లు మాత్రం.. ఆ ర్యాష్ డ్రైవింగ్‌కు.. అమాయక ప్రజలు బలీ అవుతుంటారు. తాజాగా.. సైకిల్ పైనా వెళ్తున్న ఓ వ్యక్తిని.. అతి వేగంగా వచ్చి, కారుతో ఢి కొట్టాడు. అనంతరం కారుపై ఎగిరి పడ్డ మృతదేహంతో దాదాపు 10 కిలో మీటర్లు ప్రయాణించిన ఘటన పంజాబ్‌లోని మొహాలీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక స్థానికుల సమాచారం మేరకు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు పంజాబ్‌లోని మోహలీకి చెందిన యోగేంద్ర మొండల్‌గా గుర్తించారు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల నిందితుడిని అరెస్టు చేశారు.నిందితుడు నిర్మల్ సింగ్ జిరాక్‌పూర్ నుంచి సన్నీ ఎన్‌క్లేవ్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగిన్నట్లు తెలుస్తోంది. ఇక నిందితుడు నిర్మల్ సింగ్‌ను అరెస్టు చేసి అతడిపై ఐపీసీ సెక్షన్ 279, 427, 304, 201 కింద కేసు నమోదు చేసి.. కస్టడిలోకి తీసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా, 23 న ఢిల్లీ కోర్టు తీర్పు