హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే 50 లీటర్ల పెట్రోల్ ఉచితం..!

సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే వాహనదారులకు ఒక తీపికబురు మోసుకొచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. తమ కస్టమర్లకు ఉచితంగానే పెట్రోల్ పొందే ఛాన్స్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే 50 లీటర్ల పెట్రోల్ ఉచితం..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 20, 2021 | 8:35 PM

HDFC bank credit card : దేశవ్యాప్తంగా చమురు ముట్టుకోకుండానే మంట పుట్టిస్తోంది. పెట్రో ధరలు నిత్యం పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగి..కొత్త రికార్డు స్థాయికి చేరాయి. లీటరు పెట్రోలు కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కొట్టేసింది. డీజిల్ ధర అయితే రూ.90 పైకి చేరింది.

ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే వాహనదారులకు ఒక తీపికబురు మోసుకొచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. తమ కస్టమర్లకు ఉచితంగానే పెట్రోల్ పొందే ఛాన్స్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

అయితే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ బెనిఫిట్ దక్కనుంది. ఈ కార్డు ద్వారా పెట్రోల్, డీజిల్ పోయించుకున్న వారికి రివార్డు పాయింట్లు వర్తిస్తాయి. వీటిని ఫ్యూయెల్ పాయింట్స్‌గా పిలుస్తారు. వీటిని రిడీమ్ చేసుకోవడం ద్వారా సంవత్సరానికి 50 లీటర్ల వరకు పెట్రోల్ ఫ్రీగా పొందొచ్చని సంస్థ పేర్కొంది.

ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో ఫ్యూయెల్ కొట్టిస్తే 5 శాతం ఫ్యూయెల్ పాయింట్లు పొందొచ్చు. తొలి ఆరు నెలలు నెలకు గరిష్టంగా 250 ఫ్యూయెల్ పాయింట్లు పొందొచ్చు. తర్వాత 150 ఫ్యూయెల్ పాయింట్లు వస్తాయి. గ్రాసరీ, బిల్ పేమెంట్స్‌పై నెలకు 100 ఫ్యూయెల్ పాయింట్లు లభిస్తాయి. ఇతరత్రా వాటిపై రూ.150 ఖర్చు చేస్తే 1 ఫ్యూయెల్ పాయింటు వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అంతే కాదు, 1 శాతం ఫ్యూయెల్ సర్‌చార్జ్ మినహాయింపు ఉంది. ఫ్యూయెల్ పాయింట్లు 2 ఏళ్ల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. నెలకు రూ.10 వేలకు పైగా ఆదాయం ఉన్న వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ వివరించింది. ఇందుకోసం రూ.500 జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, కార్డు వార్షిక ఫీజు రూ.500. ఏడాదికి రూ.50,000 ఖర్చు చేస్తే ఈ ఫీజు చెల్లించాల్సిన పని లేదని వెల్లడించింది.

ఇదీ చదవండి…. ఊరు పేరునే మార్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.. హోషంగాబాద్ పేరును నర్మదాపురంగా మార్పు