ఊరు పేరునే మార్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.. హోషంగాబాద్ పేరును నర్మదాపురంగా మార్పు

నర్మదా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సించ్ చౌహాన్... హోషంగాబాద్ పేరును నర్మదాపురంగా మారుస్తున్నట్లు ప్రకటించారు.

ఊరు పేరునే మార్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.. హోషంగాబాద్ పేరును నర్మదాపురంగా మార్పు
Follow us

|

Updated on: Feb 20, 2021 | 8:10 PM

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఊరు పేరే మారిపోయింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు. నర్మదా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సించ్ చౌహాన్… హోషంగాబాద్ పేరును నర్మదాపురంగా మారుస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే హోషంగాబాద్ పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తావిస్తామన్నారు. సీఎం ప్రకటనతో బీజేపీ నేతలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.

గత కొంతకాలంగా హోషంగాబాద్ పేరును నర్మదాపురంగా మార్చాలని డిమాండ్ పెరుగుతుంది. ఇందుకు సంబంధించి ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాగూర్, బీజేపీ నేత రామేశ్వర్ శర్మ తదితరులు పోరాటం చేస్తున్నారు. హోషంగాపూర్‌కు మోక్షదాయిని అయిన నర్మదా నది పేరు పెట్టాలని సూచించారు. ఈ నేపధ్యంలో శివరాజ్ ప్రభుత్వం కూడా ఇందుకు మద్దతు పలికింది. కాగా, మధ్యప్రదేశ్ లో ఇటీవల కాలంలో కొన్ని చారిత్రాత్మక ప్రాంతాల పేర్లను మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఇదీ చదవండి… రేపు రైతు నేతలతో భేటీ కానున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజకీయ ఉద్దేశమా ?లేక ?