ట్విటర్ ఇండియా వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఐటీ అధికారులకు సమన్లు జారీ చేసింది. డిజిటల్ స్పేస్ లో పౌరుల హక్కులకు సంబంధించిన అంశాలపై ‘ముఖ్య ఆధారాలను సేకరించేందుకు సమన్లు పంపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ట్విటర్ ఇండియా భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడచుకుంటున్నదా లేదా అన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని ఈ వర్గాలు వెల్లడించాయి. ట్విటర్ ఎదుర్కొంటున్న కోర్టు కేసు,ఇటీవల కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, శశిథరూర్ అకౌంట్ల బ్లాక్ తదితర విషయాలను ఇందులో ప్రస్తావిస్తారని.. అంటే ఒక రకంగా ట్విటర్ ఇండియా మొండి వైఖరిని ఎండగడతారని భావిస్తున్నారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కమిటీ మీటింగ్ లో ఐటీతో బాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొంటున్నారు. డిజిటల్ స్పేస్ లో మహిళల భద్రత అంశంతో బాటు సోషల్-ఆన్ లైన్ వేదికలపై న్యూస్ మీడియా దుర్వినియోగ నివారణ, అభ్యంతర కర కంటెంట్ల తొలగింపు వంటి వాటిపై తమ సమీక్షను ఈ సందర్భంగా అధికారులు ఈ కమిటీకి వివరించనున్నారు.
ముఖ్యంగా ట్విటర్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ…ఈ సామాజిక మాధ్యమానికి ఢిల్లీ పోలీసుల నోటీసుల విషయాన్ని వారు కమిటీ దృష్టికి తేనున్నారు. ప్రధానంగా ఏయే విషయాలను ప్రస్తావించాలో అందుకు సంబంధించిన అధికారిక అజెండాను సర్క్యులర్ రూపంలో పానెల్ తమ సభ్యులందరికీ పంపింది. కాగా ఐటీ నిబంధనలను ట్విటర్ అతిక్రమించిందని కేంద్రం నిన్న మళ్ళీ తాజాగా ఆరోపించింది. మీకు న్యాయ సహాయం ఉండదని హెచ్చరించినా ఈ సామాజిక మాధ్యమం తన దారిలోనే పోతోందని ఆరోపించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:తేలు విషాన్ని చిమ్మడం మీరెప్పుడైనా చూశారా? విషం చిమ్ముతున్న స్లో మోషన్ వైరల్ అవుతున్న వీడియో..:Scorpion video.