హిజ్రాలనూ వదలడు … వీడు మామూలోడు కాదు..

ఇప్పటికే దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి.. హిజ్రాలు, పురుషులపై కూడా అత్యాచారం కేసులు అనేకం ఈమధ్యకాలంలో వెలుగుచూస్తున్నాయి. అయితే పోలీసుల రికార్డుల్లో సాధారణంగా నమోదయ్యేవి అధికంగా మహిళల కేసులే. అయితే జైపూర్‌ పోలీసులకు ఓ కామాంధుడు పట్టుబడ్డాడు. వీడి నేర చరిత్ర చూసి పోలీసులే అవాక్కయ్యారు. వీడి టార్గెట్ మహిళలు మాత్రం కాదు. ఇదిలా ఉంటే జైపూర్.. శాస్త్రి నగర్‌లో గతంలో ఏడేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేశారు. అప్పుడు సీసీ కెమెరాలో ఈ కిడ్నాప్ […]

హిజ్రాలనూ వదలడు ... వీడు మామూలోడు కాదు..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 8:50 PM

ఇప్పటికే దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి.. హిజ్రాలు, పురుషులపై కూడా అత్యాచారం కేసులు అనేకం ఈమధ్యకాలంలో వెలుగుచూస్తున్నాయి. అయితే పోలీసుల రికార్డుల్లో సాధారణంగా నమోదయ్యేవి అధికంగా మహిళల కేసులే. అయితే జైపూర్‌ పోలీసులకు ఓ కామాంధుడు పట్టుబడ్డాడు. వీడి నేర చరిత్ర చూసి పోలీసులే అవాక్కయ్యారు. వీడి టార్గెట్ మహిళలు మాత్రం కాదు.

ఇదిలా ఉంటే జైపూర్.. శాస్త్రి నగర్‌లో గతంలో ఏడేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేశారు. అప్పుడు సీసీ కెమెరాలో ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం రికార్డయింది. మెహానికి ముసుగు ధరించిన వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్టుగా గుర్తించారు పోలీసులు. బాలుడ్ని కిడ్నాప్ చేసి తప్పించుకున్న బైక్ నెంబర్ ఆధారంగా సెర్చింగ్ మొదలు పెట్టే సరికి మూడురోజుల క్రితం అదే బైక్‌పై వెళుతూ పోలీసులకు ఓ వ్యక్తి దొరికాడు. అతడి పేరు జీనూ. ఇతడ్ని పట్టుకుని విచారిస్తే దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం.. చిన్నారుల్ని కిడ్నాప్ చేయడం, వారిని అమ్మేయడం తనకు అలవాటని చెప్పాడు. ఇప్పటి వరకు వీడు 25 మంది చిన్నారుల్ని మిస్ చేశాడట. అలాగే మనసుపారేసుకున్న పురుషులను వయసుతో సంబంధం లేకుండా అత్యాచారం చేయడం, ట్రాన్స్ జెండర్స్‌పై కూడా అఘాయిత్యాలు చేయడం మామూలేనని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు ఈ కంత్రీగాడు.

పోలీసుల విచారణలో వీడి గత చరిత్రకు సంబంధించిన పలు విషయాలు కూడా వెల్లడించాడు. ఇప్పటివరకు 40 మందిపై అత్యాచారాలు చేశాడని, ఓ బాలుడిపై అసహజ లైంగిక చర్యకు పాల్పడినందుకు 2004లో అరెస్టయి, 2015లో బెయిల్‌పై బయటికొచ్చాడట. బయటికొచ్చాక మళ్లీ అదే పనిగా పెట్టుకున్నాడట. ఇప్పటివరు వీటిపై పలు కేసులు నమోదైనట్టు జైపూర్ పోలీసుల విచారణలో తేలింది. వీడిపై నమోదైన కేసులకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు జైపూర్ పోలీసులు.