రష్యా రూపొందించిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను తాము కూడా తయారు చేస్తామని, అందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే భారత్‌లో స్పుత్నిక్-వీ వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇవ్వగా.. రష్యా నుంచి దాదాపు 30 లక్షల డోసులు భారత్‌కు చేరుకున్నాయి. వీటిని హైదరాబాద్‌లోని రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. కాగా, ఇప్పుడు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రభావశీలత గురించి విశ్లేషణ, పరీక్షలు చేయడానికి కూడా అనుమతులు ఇవ్వాలని సీరం సంస్థ డీసీజీఐని కోరినట్లు సమాచారం.
ఫైజర్, మోడెర్నా తరహాలోనే తమకు కూడా నష్టపరిహార నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని సీరం కోరుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్వదేశీ అయినా, విదేశీ అయినా టీకా తయారీదారులందరికీ ఒకే రకమైన భద్రత ఉండాలని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే భారత్‌లో సీరం ఆక్స్‌ఫర్డ్ టీకా కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ నెలలో 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగలమని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. అంతేగాక, అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. దీనికి అమెరికా నుంచి మరికొన్ని అనుమతులు రావాల్సి ఉంది.
Also Read:
ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..
దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?