క్రైమ్ థ్రిల్లర్స్‌ కూడా పనికిరావు.. 4 నెలలు..! 8 హత్యలు..!! కారణాలు తెలిసి బిత్తరపోయిన పోలీసులు

నాలుగు నెలలు, 8 మరణాలు.. ఆ గ్రామంలో వరుస చావులకు కారణం తెలియక స్థానికులు తలలు పట్టుకున్నారు. ఒకరి తర్వాత ఒకరి చావులపై అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు. సీన్‌కట్‌చేస్తే.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.. ఈ 8 మందికి సహజ మరణాలు కావని.. పక్కా ప్లాన్‌లో ఓ సైకో చేసిన మర్డస్ అని తేల్చారు. అది విన్న స్థానికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

క్రైమ్ థ్రిల్లర్స్‌ కూడా పనికిరావు..  4 నెలలు..! 8 హత్యలు..!! కారణాలు తెలిసి బిత్తరపోయిన పోలీసులు
Chhattisgarh Serial Killer Shopkeeper

Updated on: Jun 24, 2026 | 11:16 AM

ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మందికి వరుసగా విషమిచ్చి చంపిన ఓ సైకోను ఎట్టకేలకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బలోదాబజార్ జిల్లా ఖర్వే గ్రామానికి చెందిన రామ్ సహాయ్ జైస్వాల్ అనే కిరాణా వ్యాపారిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను బాధితులందరికి బోరాక్స్ పౌడర్‌ను కలిపి డ్రింగ్ ఇచ్చిన హతమార్చినట్టటు పోలీసులు తెలుపుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విషం ఇచ్చి చంపిన తర్వాత నిందితుడే వాళ్లను హాస్పిటల్‌కు తీసుకెళ్లి.. వారి అంత్యక్రియల్లో సైతం పాల్గొంటూ తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ తన కబంద హస్తాల నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి చెప్పిన సాక్ష్యంతో చివరకు కటకటాల పాలయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని ఖార్వే గ్రామంలో గత నాలుగు నెలలుగా వరుసగా జరుగుతున్న మరణాలపై స్థానికులకు, బాధితుల బంధువుల తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ మరణాలన్నీ అనారోగ్యం వల్లో లేదా సహజంగానే జరిగాయని అందరూ భావించారు. కానీ చనిపోయే ముందు బాధితులు అందరూ సహాయ్ జైస్వాల్‌ను కలిశారనే కోణం బయటకు రావడంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా చివరిగా మరణించిన మహేతరు సాహు అనే వ్యక్తి మృతదేహాన్ని వెలికిసిన పోలీసులు.. మరో ఆరు మృతదేహాలను కూడా బయటకు తీసి రిపోస్ట్‌మార్టం కోసం మార్చరీకి తరలించారు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్టులో వీరంతా విష ప్రయోగం కారణంగానే మరణించారని తేలింది. అయితే
నిందితుడు ఇచ్చిన విషపు డ్రింక్‌ను తాగిన కార్తీక్ అనే వ్యక్తి అదృష్టవశాత్తు తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అతన్ను విచారించిన పోలీసులు అసలు విషయం తెలుసుకున్నారు. జైస్వాల్ ఇచ్చిన డ్రింక్ తాగిన తర్వాతే అతని ఆరోగ్యం క్షిణించినట్టు కార్తిక్ పోలీసులకు తెలిపాడు.

దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని ప్రశ్నించగా.. మొదట పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన జైస్వాల్, పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. పాత కక్షలు, అప్పుల కారణాలతోనే వీరిని టార్గెట్ చేసినట్లు హత్య చేసిన జైస్వాల్ అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిపై ఎనిమిది హత్య కేసులు, ఒక హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

జైస్వాల్.. ఎవరిని, ఎప్పుడు ఎందుకు చంపాడు?

  • ఫిబ్రవరి 6న మొదటి హత్య: తరచూ గొడవ పడుతున్నాడనే కారణంతో బద్రి అనే వ్యక్తిని హత్య చేశాడు
  • ఫిబ్రవరి 20న రెండో హత్య: బుథాలు అనే వ్యక్తిని సామాజిక, ఎన్నికల వివాదాల కారణంగా హత్య చేశాడు.
  • మార్చి 12న మూడో హత్య: తన భార్య పట్ల చెడు ఉద్దేశంతో ఉన్నాడనే అనుమానంతో ఛట్టు రామ్ అనే వ్యక్తిని హత్య చేశాడు
  • మార్చి 20న నాలుగో హత్య: భూవివాదం కారణంగా బుధ్‌రామ్ అనే వ్యక్తికి విషమిచ్చి హత్య చేశాడు
  • మార్చి 31న ఐదో హత్య: తనతో పదే పదే గొడవలు పడుతుండటంతో వినోద్ కుమార్ అనే వ్యక్తి హతమార్చాడు.
  • ఏప్రిల్ 28 న ఆరో హత్య: ..చేతబడి చేస్తూ తనకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నాడనే నెపంతో గజానంత్ అనే వ్యక్తి హత్య చేశాడు
  • ఏప్రిల్ 29న ఏడో హత్య: తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకుండా ఉండేందుకు చైతురామ్ అనే వ్యక్తిని హత్య చేశాడు.
  • మే 14న ఎనిమిదో హత్య: చిన్న కారణంతో చివరిగా మహేతర్ రామ్ అనే వ్యక్తిని పొట్టనబెట్టుకున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us