Nandigram: నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారికి పూర్తి భద్రత.. ఆర్వోకి ఏం జరిగినా బెంగాల్ ప్రభుత్వానిదే బాధ్యతః ఈసీ

|

May 04, 2021 | 6:45 PM

నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి పూర్తిస్థాయి భద్రత కల్పించినట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానానికి నివేదించింది.

Nandigram: నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారికి పూర్తి భద్రత.. ఆర్వోకి ఏం జరిగినా బెంగాల్ ప్రభుత్వానిదే బాధ్యతః ఈసీ
Follow us on

Security provided to Nandigram RO: నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి పూర్తిస్థాయి భద్రత కల్పించినట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానానికి నివేదించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సందర్భంగా దీదీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠభరితంగా కౌంటింగ్ కొనసాగింది.

ఒకప్పటి టీఎంసీ నేత, ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేసిన అధికారి చేతిలో మమత బెనర్జీ1,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా రీకౌంటింగ్ కోసం తాను డిమాండ్ చేసినప్పటికీ నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారి ప్రాణభయంతో అంగీకరించలేదని నిన్న మమత ఆరోపించారు. కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సదరు రిటర్నింగ్ అధికారికి, ఆయన కుటుంబానికి భద్రత కల్పించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. విధి నిర్వహణ కారణంగా ఆయనపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు సదరు అధికారికి ఇచ్చిన భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలంటూ ఎన్నికల సంఘం ఇవాళ బెంగాల్ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. ఆయనకు తగిన వైద్య సహాయంతో పాటు, కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలని కూడా ఈసీ కోరింది. ఈ నేపథ్యంలోనే నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారికి ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా, ఏమాత్రం హాని జరిగినట్టు ఊహాగానాలు వచ్చినా అక్కడ ఎన్నికల కోసం కేటాయించిన మొత్తం యంత్రాంగంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం.. బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అన్ని ఎన్నికల రికార్డులను భద్రం చేయాలనీ, పోలింగ్ ముగిసిన ఈవీఎంలు, వీవీపాట్‌ మెషీన్లు, వీడియో రికార్డులు, కౌంటింగ్ రికార్డులను భద్రపర్చాలంటూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Read Aslo….  కరోనా సెకండ్ వేవ్ .. పరిశోధనలో షాకింగ్‌ న్యూస్‌.. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి.!