మూడు జ్యోతిర్లింగాలను కలిపే ఓ రైల్లో ‘ మినీ టెంపుల్ వెలిసింది’.ఏకంగా పరమశివుడికి ఓ బెర్తునే రిజర్వ్ చేసేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓంకారేశ్వర్ ను, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ను, యూపీ.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ (మూడు జ్యోతిర్లింగాలను) కలిపే ‘కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్’ లోని ‘వింత’ ఇది ! ప్రధాని మోదీ ఈ రైలును ఈ నెల 16 న పచ్ఛజెండా ఊపి ప్రారంభించారు. వారణాసి నుంచి ఇండోర్ వరకు 1131 కి.మీ. దూరం ఈ రైలు ప్రయాణిస్తుంది. వారానికి మూడు సార్లు నడిచే ఈ ట్రెయిన్ ఈ నెల 20 నుంచి తన సర్వీసులను అందించనుంది.
కాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఈ రైల్లో 64 వ నెం. బెర్తును మినీ టెంపుల్ గా మార్చడం పట్ల పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ వార్త తాలూకు ఫోటోను, రాజ్యాంగాన్ని ట్యాగ్ చేసి ప్రధానమంత్రి కార్యాలయానికి ట్వీట్ చేశారు. అటు-దేవుడికి రైల్లో బెర్తును రిజర్వ్ చేయడమన్నది ఇదే మొదటిసారని నార్తర్న్ రైల్వే అధికారులు తెలిపారు. ఏసీ బోగీలున్న ఈ ట్రెయిన్ లో ప్రతి కోచ్ లోను ఇద్దరు గార్డులు ఉంటారు. మెల్లగా భక్తి సంగీతం వినిపిస్తుంటుంది. అలాగే కేవలం శాకాహారం మాత్రమే అందిస్తారు.
Sir @PMOIndia https://t.co/HCeC9QcfW9 pic.twitter.com/6SMJXw3q1N
— Asaduddin Owaisi (@asadowaisi) February 17, 2020
Railway officials say that efforts will be made to keep the seat number 64 of coach B5 in Kashi Mahakal Express (Varanasi-Indore), reserved for Lord Shiva. The seat has been turned into a mini-temple of Lord Shiva. https://t.co/YuF8vmrWWn
— ANI UP (@ANINewsUP) February 17, 2020