Delhi Pollution: నవంబర్ 21 వరకు విద్యాసంస్థలు మూసివేయండి.. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశం..

|

Nov 17, 2021 | 6:44 AM

ఢిల్లీ దాని సమీప నగరాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ మంగళవారం అర్ధరాత్రి ఆదేశించింది. దీపావళి నుంచి నగరాన్ని విషపూరిత పొగమంచు కప్పేసింది. దీంతో విద్యా సంస్థలు మూసివేయాలని కోరింది...

Delhi Pollution: నవంబర్ 21 వరకు విద్యాసంస్థలు మూసివేయండి.. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశం..
Delhi
Follow us on

ఢిల్లీ దాని సమీప నగరాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ మంగళవారం అర్ధరాత్రి ఆదేశించింది. దీపావళి నుంచి నగరాన్ని విషపూరిత పొగమంచు కప్పేసింది. దీంతో విద్యా సంస్థలు మూసివేయాలని కోరింది. దీంతో పాఠశాలలు కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో నిర్వహించినట్లు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. CAQM జారీ చేసిన తొమ్మిది పేజీల ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 21 వరకు కనీసం 50 శాతం మంది సిబ్బందిని ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలని NCR ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఢిల్లీ NCR లోని ప్రైవేట్ సంస్థలు కూడా తప్పనిసరిగా ” తమ సిబ్బందిలో కనీసం 50 శాతం మందిని ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతించాలని CAQM (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సబ్‌కమిటీ) ఉత్తర్వుల్లో పేర్కొంది.

రోడ్లపై వ్యర్థాలు పడేస్తే సంబంధిత వ్యక్తులు/సంస్థలపై భారీ జరిమానా విధించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ NCR అంతటా నిర్మాణ కార్యకలాపాలు, కూల్చివేత ప్రాజెక్టులు నవంబర్ 21 వరకు నిలిపివేశారు. రైల్వే సేవలు/స్టేషన్లు, మెట్రో కార్యకలాపాలు, విమానాశ్రయాలు, బస్ టెర్మినల్స్, అలాగే జాతీయ భద్రత లేదా రక్షణ సంబంధిత కార్యకలాపాల ప్రాజెక్ట్‌లకు మినహాయింపులు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ NCR లో 11 థర్మల్ పవర్ ప్లాంట్లలో ఐదు పనిచేస్తున్నాయి. ఎన్‌సీఆర్ రాష్ట్రాలు, ఢిల్లీ కూడా నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే ట్రక్కులను మినహాయించి మిగతా ట్రక్కుల అనుమతిచ్చొద్దని ఆదేశించింది.

10, 15 దాటిన పెట్రోల్, డీజిల్ వాహనాలు రోడ్లపైకి అనుమతించడం లేదు. గాలి నాణ్యత సంక్షోభం కోసం అత్యవసర ప్రణాళిక లేకపోవడంపై ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రశ్న వర్షం కురిపించింది. వారాంతంలో లాక్‌డౌన్, వర్క్ ఫ్రమ్ హోం ఒక వారం పాటు ఇవ్వాలని సూచించింది. ఢిల్లీ గాలి పీల్చడం అంటే “రోజుకు 20 సిగరెట్లు తాగడం లాంటిది” అని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అంగీకరించింది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్‌తో సహా చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పుడు ఏడు రోజులుగా కలుషితమైన గాలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. నవంబర్ 4 న దీపావళి రోజున వేలాది మంది బాణాసంచా పేల్చారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల ఆదేశాలను నిర్ద్వంద్వంగా ఉల్లంఘించడంతో గాలి నాణ్యత స్థాయిలు తగ్గాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12.27 గంటలకు ఢిల్లీలో మొత్తం AQI 397గా ఉంది. ఈ స్థాయిలలో కలుషితమైన గాలిలో PM2.5 కణాల అధిక సాంద్రతలు ఉంటాయని, ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్, హృదయ, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి.

Read Also.. Indian Railway: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రైలు ఛార్జీలు తగ్గనున్నాయి.. ఎంత అంటే..!