AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Policy Scam: లిక్కర్‌ స్కాంలో మనీష్‌ సిసోడియాకు ఎదురు దెబ్బ.. ఇద్దరు మంత్రుల రాజీనామా ఆమోదించిన కేజ్రీవాల్‌..

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోదియాకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్​పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.

Liquor Policy Scam: లిక్కర్‌ స్కాంలో మనీష్‌ సిసోడియాకు ఎదురు దెబ్బ.. ఇద్దరు మంత్రుల రాజీనామా ఆమోదించిన కేజ్రీవాల్‌..
Manish Sisodia
Sanjay Kasula
|

Updated on: Feb 28, 2023 | 6:32 PM

Share

లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తన పదవికి రాజీనామా చేశారు. సీబీఐ తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టులో పిటిషన్‌ వేసుకోవచ్చని సూచించింది. ఇదే సమయంలో జైల్లో ఉన్న మరో మంత్రి సత్యేంద్రజైన్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఢిల్లీ జైలులో ఉన్నారు సత్యేంద్రజైన్‌. కేజ్రీవాల్‌ కేబినెట్‌లో కీలకమైన విద్యాశాఖను సిసోడియా నిర్వహించారు. సత్యేంద్రజైన్‌ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు.

ఢిల్లీ​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 నూతన మద్యం పాలసీ కొత్త విధానంలో అనేక అక్రమాలు జరిగాయని గతేడాది జులైలో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. నిబంధనల ఉల్లంఘన సహా విధానపరమైన లోపాలతో ఈ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అప్పట్లో రిపోర్టు ఇచ్చారు. కొందరికి లబ్ధి చేకూర్చేలా టెండర్ల విధానంలో మార్పులు చేసినట్లుగా ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అబ్కారీ శాఖ ఇన్​ఛార్జ్​ మంత్రిగా ఉన్న మనీశ్​ సిసోదియా పేరునూ ఇందులో ప్రధానంగా చేర్చారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్​ కుమార్​ సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేయడంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. దీంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ లిక్కర్ స్కాం కేసులో పలువురు నేతలతో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. చివరకు ఈ ఎక్సైజ్​ నూతన పాలసీ విధానాన్ని ఢిల్లీలోని ఆప్​ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

లైవ్ వీడియో కోసం ఇక్కడ చూడండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!