Save soil Sadhguru: మట్టి కోసం కదం తొక్కిన సద్గురు.. మట్టి ఇసుకగా మారకుండా పునరుజ్జీవింపజేసేందుకు ఉద్యమం

రానున్న 2, 3 దశాబ్దాల్లో ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

Save soil Sadhguru: మట్టి కోసం కదం తొక్కిన సద్గురు.. మట్టి ఇసుకగా మారకుండా పునరుజ్జీవింపజేసేందుకు ఉద్యమం
Sadhguru Vasudev Save Soil

Updated on: May 25, 2022 | 1:56 PM

Save soil Sadhguru: ఇషా పౌండేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురురు సద్గురు జగ్గీ వాసుదేవ్ కొంత కాలంగా Save Soil పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దావోస్ వేదికపై ప్రపంచ స్థాయి కంపెనీల ప్రతినిధులను కలిసి తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రానున్న 2, 3 దశాబ్దాల్లో ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉందని సద్గురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

మట్టి అంతరించిపోకుండా రక్షించేందుకు కాలానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ ప్రచారంలో భాగంగా ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన మట్టిని రక్షించు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్ని దేశాలలో పెద్ద ఎత్తున విధానపరమైన మార్పులు వస్తే తప్ప, మనం ఏం చేయలేని స్థితికి చేరుకున్నామని సద్గురు హెచ్చరించారు. భూమి ఎడారీకరణను ఆపడానికి, కాలానికి వ్యతిరేకంగా జరుగుతున్న పందెం గురించి ఆయన ప్రస్తావించారు. వ్యవసాయ భూములను అధికంగా సాగు చేయడంవల్ల, ప్రపంచవ్యాప్తంగా సారవంతమైన మట్టి వేగంగా ఇసుకగా మారుతుందన్నారు. ఈ భూమికి పెద్ద ముప్పు పొంచి ఉందని ఆయన సూచించారు.

మట్టిని పునరుజ్జీవింపజేసేందుకు, మరింత క్షీణతను అరికట్టేందుకు, విధాన ఆధారిత చర్యలను ప్రారంభించగలిగేలా, ప్రభుత్వాలకు సాధికారతను చేకుర్చడమే ఈ ఉద్యమ లక్ష్యమన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా, 192 దేశాలకోసం, మట్టికి అనుకూలమైన మార్గదర్శకాలపై పత్రాలను సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..