Road Accident: ఎల్లమ్మతల్లి దర్శనానికి నడుచుకుంటూ వెళ్లున్న భక్తులు.. బొలెరో రూపంలో ఆరుగురిని మింగేసిన మృత్యువు..

|

Jan 05, 2023 | 8:06 AM

వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం ఎస్పీ డా.సంజీవ్ పాటిల్ ఆ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. గాయపడిన వారందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

Road Accident: ఎల్లమ్మతల్లి దర్శనానికి నడుచుకుంటూ వెళ్లున్న భక్తులు.. బొలెరో రూపంలో ఆరుగురిని మింగేసిన మృత్యువు..
Road Accident Belagavi
Follow us on

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్గాం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతువాతపడ్డారు. రామదుర్గ తాలూకా చుంచనూర్ గ్రామ సమీపంలో గుంతలు, గతుకులతో అధ్వాన్నమైన రోడ్డు కారణంగా బొలెరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టింది. స్పాట్‌లోనే ఆరుగురు చనిపోయారు. మృతులు హనుమవ్వ(25), దీప(31), సవిత(17), సుప్రీత(11), మారుతి(42), ఇందిరవ్వ(24) మృతి చెందారు.

హులకుంట గ్రామం నుంచి సవదత్తి ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పికప్ బొలెరో వాహనంలో 23 మంది ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం ఎస్పీ డా.సంజీవ్ పాటిల్ ఆ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. గాయపడిన వారందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

మృతులు కాలినడకన ఎల్లమ్మ ఆలయానికి బయలుదేరారు. ఈ సమయంలో బొలెరో వాహనం డ్రైవర్‌ యాత్రికులను ఆపి మరీ వారిని గుడివద్ద దింపుతానని చెప్పి వాహనం ఎక్కించాడు. వాహనం ఎక్కిన నిమిషాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..