AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haj Committee of India: హజ్ యాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా?.. భారత ప్రభుత్వం విడుదల చేసిన ఈ కీలక అంశాలు మీకోసమే..

Haj Committee of India: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Haj Committee of India: హజ్ యాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా?.. భారత ప్రభుత్వం విడుదల చేసిన ఈ కీలక అంశాలు మీకోసమే..
Shiva Prajapati
|

Updated on: Mar 03, 2021 | 8:52 PM

Share

Haj Committee of India: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కా. ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భారతదేశం మొదలు.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తుంటారు. అయితే, గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా సౌదీ ప్రభుత్వం హజ్ యాత్రపై ఆంక్షలు విధించింది. రోజుకు 1000 మందికి మాత్రమే అనుమతిచ్చింది. దాంతో ఆ ఏడాది హజ్ యాత్రకు పెద్దగా వెళ్లలేకపోయారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో మక్కా సందర్శనకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది సౌదీ సర్కార్. ఇదే సమయంలో భారత ప్రభుత్వం కూడా హజ్ యాత్రకు వెళ్లే వారిని ఉద్దేశించి కీలక ప్రకటన విడుదల చేసింది. పలు షరతులు విధించింది. మరి ఆ షరతులేంటి? భారత్ హజ్ కమిటీ ఎలాంటి సూచనలు చేసింది? ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశం నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికోసం భారత హజ్ కమిటీ కీలక సూచనలు చేసింది.. 1. ఈ ఏడాది హజ్ యాత్రకు షెడ్యూల్‌ను ప్రకటించిన భారత హజ్ కమిటీ.. ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక నిబంధనలు, నియమాలు, అర్హత, ప్రమాణాలు, వయో పరిమితి వంటి అంశాల ఆధారంగా యాత్ర జరుగుతుందని చెప్పింది. 2. హజ్ యాత్రకు వెళ్లే వారి వయోపరిమితి 18-65 సంవత్సరాలుగా పేర్కొంది. 3. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా వెళ్లే యాత్రికులు సామాజిక దూరం నిబంధనలను పాటించాలంది. 4. మధుమేహం, గుండె, శ్వాసకోస వంటి తీవ్రమైన జబ్బులు ఉన్నట్లయితే హజ్ యాత్రకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. 5. హజ్ 2021 లో ఖర్చు సాధారణ కంటే చాలా ఎక్కువగా ఉంటుందని, ఈ అదనపు ఖర్చును భరించగలిగేంత ఆర్థిక స్థోమత ఉన్న యాత్రికులు మాత్రమే హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. 6. 2020 డిసెంబర్ 10 న లేదా అంతకు ముందు జారీ చేయబడిన మెషిన్ రీడబుల్ భారతీయ అంతర్జాతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. ఇంకా ఆ పాస్‌పోర్ట్ కనీసం 2022 జనవరి 10 వరకు చెల్లుబాటు అయ్యేదై ఉండాలి. అలా లేని వ్యక్తులను హజ్ యాత్రకు అనుమతించబడదు. 7. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఇప్పటికే మక్కాను సందర్శించిన వ్యక్తి మరోసారి మక్కాకు వెళ్లేందుకు అమనుతించరు. అయితే, ఇప్పటి వరకు హజ్ యాత్ర చేయని మహిళ వెంట మాత్రం వారు రావొచ్చు.

Also read:

Hyderabad Company: 18 గంటల్లో 28 కిలోమీటర్ల రోడ్డు పూర్తి.. సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరబాద్ నిర్మాణ సంస్థ..

కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్‌ హవా..! మరో 40 ఒరిజిన‌ల్స్ విడుద‌లకు రంగం సిద్ధం.. ఏ ఏ సినిమాలు ఉన్నాయంటే..