Satyendar Jain: మంత్రా మజాకా..! మొన్న మసాజ్.. నిన్న బయటి ఫుడ్.. ఇవాళ జైలు అధికారితోనే.. సంచలన వీడియో..

|

Nov 26, 2022 | 10:04 AM

మొన్న మసాజ్.. నిన్న బయటి ఫుడ్.. నేడు ఏకంగా జైలు అధికారితో ముచ్చట్లు.. ఇవన్నీ.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని మరింత ఇరకాటంలో పడేశాయి.

Satyendar Jain: మంత్రా మజాకా..! మొన్న మసాజ్.. నిన్న బయటి ఫుడ్.. ఇవాళ జైలు అధికారితోనే.. సంచలన వీడియో..
Satyendar Jain
Follow us on

మొన్న మసాజ్.. నిన్న బయటి ఫుడ్.. నేడు ఏకంగా జైలు అధికారితో ముచ్చట్లు.. ఇవన్నీ.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని మరింత ఇరకాటంలో పడేశాయి. ఢిల్లీ తీహార్‌ జైల్లో ఉన్న సత్యేందర్ జైన్.. అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. ఆయనకు మసాజ్‌ చేయించుంటున్న వీడియోలు, ఫ్రూట్‌ సలాడ్‌ తింటున్న వీడియోలు చర్చనీయాంశంగా మారితే.. ఇప్పుడు జైలు అధికారులతోనే పిచ్చాపాటీ కాలక్షేపానికి సంబంధించిన వీడియో కూడా లీక్ అవడంతో ఆప్‌ మరింతగా ఇరకాటంలో పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ, ఆప్ మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు గుజరాత్ ఎన్నికలు, మరోవైపు ఎంసీడీ ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్న ఆప్ కు.. సత్యేందర్ జైన్ వీడియోలు తలనొప్పిగా మారాయి. తాజాగా.. విడుదలైన వీడియోలో సత్యేందర్ జైన్, జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌ కనిపిస్తున్నారు. ఈ వీడియో సెప్టెంబర్ 12 నాటిదని తెలుస్తోంది.

ఈ వీడియోలో.. ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్.. జైలు సూపరింటెండెంట్ తో ముచ్చటిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. జైల్ సూపరింటెండెంట్ అజిత్ కుమార్ వచ్చే వరరకు సత్యేందర్ జైన్.. అప్పటివరకు దర్బార్ తరహాలో ఇతర ఖైదీలతో ముచ్చటిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే.. ఆప్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ.. ఈ వీడియో సంగతేంటంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై ఆప్ స్పందించాల్సి ఉంది..

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం..