శశికళకు మరో షాక్ ఇచ్చిన తమిళ సర్కార్.. జయలలిత దత్తపుత్రుడు సుదాకరన్ ఆస్తుల జప్తు..
శశికళ బంధువు, జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్‌కు సంబంధించిన 6 ఆస్తులను జప్తు చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం.
sudhakaran property undertake by Government : శశికళకు మరో షాక్ తగిలింది.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పూర్తి చేసుకుని ఇటీవల విడుదలైన జయలలిత స్నేహితురాలు శశికళ సోమవారం చెన్నైకి చేరుకోబోతున్నారు. ఈ తరుణంలో లో శశికళ బంధువు, జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్‌కు సంబంధించిన 6 ఆస్తులను జప్తు చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు చెన్నై జిల్లా కలెక్టర్ నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొంది.
ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులో, చెన్నై రెవెన్యూ జిల్లాకు చెందిన యువరాణి సుధాకరన్‌కు చెందిన ఆరు ఆస్తులు జాతీయం చేస్తున్నాము.. ఇకపై ఈ ఆస్తి తమిళనాడు ప్రభుత్వ ఆస్తిగా పేరు మార్చబడినందున, ఈ ఆస్తులన్నీ తమిళనాడు ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాల్సి ఉంటుందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా , ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు సుధాకర్, ఇలవరసిలకు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. శిక్ష కాలం పూర్తి చేసుకున్న శశికళ ఇటీవల విడుదలయ్యారు. ఇలవరసి రేపు విడుదల కానున్నారు. ఇంకా జరిమానా కట్టని కారణంగా సుధాకరన్ జైలులోనే ఉన్నారు. ఈ హఠాత్తు పరిణామాలతో తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి.