Crime news: సర్పంచ్ దుశ్చర్య.. న్యాయం చేయాలని నిరసన చేస్తే ముక్కు కోసేశాడు

|

Mar 21, 2022 | 12:14 PM

ఊరి ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వాటిని పరిష్కరించే హోదాలో ఉన్న వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. జనాలకు అండగా, రక్షణగా నిలవాల్సిన వాడే ఓ యువతి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. తన ఇంటి ఎదుట నిరసన చేస్తున్న యువతి ముక్కు కోసేశాడు....

Crime news: సర్పంచ్ దుశ్చర్య.. న్యాయం చేయాలని నిరసన చేస్తే ముక్కు కోసేశాడు
Student Harassment
Follow us on

ఊరి ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వాటిని పరిష్కరించే హోదాలో ఉన్న వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. జనాలకు అండగా, రక్షణగా నిలవాల్సిన వాడే ఓ యువతి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. తన ఇంటి ఎదుట నిరసన చేస్తున్న యువతి ముక్కు కోసేశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేశారు. మరోవైపు తనపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ (Sarpanch) పేర్కొనడం గమనార్హం. బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో దారుణం జరిగింది. తమను వేధిస్తున్నాడని సర్పంచ్ ఇంటి ఎదుట నిరసనకు దిగిన యువతి ముక్కు (Nose) ను ఊరి సర్పంచ్ కోసేశాడు. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోథ్ గ్రామానికి చెందిన బాధితురాలు.. సర్పంచ్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మగ్గురు యువతులు ఆరోపించారు. అయితే వీరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. అతని ఇంటి ముందు ధర్నాకు దిగారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్.. నిరసన చేస్తున్న వారిలో ఓ యువతి ముక్కును కోసేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వెంటనే అప్రమత్తమైన బాధితురాలి బంధువులు ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సర్దార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరోవైపు తనపై వస్తున్న వార్తలను సర్పంచ్ మహ్మద్ ముస్తాకీమ్ ఖండించారు. అవన్నీ పూర్తి అవాస్తవాలని, కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన గౌరవ మర్యాదలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సర్పంచ్ తరఫున కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని సర్పంచ్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సదర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మనోజ్ మెహతా తెలిపారు.

Also Read

Pakistan PM Imran Khan: పదవి ఉంటుందా.. ఊడిపోతుందా? ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం తేలేది ఆ రోజే..

Sound Pollution: నగరంపై ఉరుముతున్న శబ్ద మేఘాలు.. సౌండ్ పొల్యూషన్ తో ఉక్కిరిబిక్కిరి

Shocking: అక్కడ కేజీ చికెన్ 1000.. ఒక్కో గుడ్డు 35 రూపాయలు.. కిలో ఉల్లిపాయలు 250