AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకకు వైద్య విద్యార్థి నవీన్‌ డెడ్‌బాడీ.. ఎయిర్‌పోర్టులో నివాళులర్పించిన సీఎం బస్వరాజు బొమ్మై

ఉక్రెయిన్‌లో రష్యా దాడిలో మృతి చెందిన కర్ణాటక విద్యార్ధి నవీన్‌ శేఖరప్ప డెడ్‌బాడీ ఎట్టకేలకు సోమవారం బెంగళూరుకు చేరుకుంది.

కర్ణాటకకు వైద్య విద్యార్థి నవీన్‌ డెడ్‌బాడీ.. ఎయిర్‌పోర్టులో నివాళులర్పించిన సీఎం బస్వరాజు బొమ్మై
Karnatka Medical Student
Balaraju Goud
|

Updated on: Mar 21, 2022 | 11:38 AM

Share

Karnatka Medical Student: ఉక్రెయిన్‌(Ukraine)లో రష్యా(Russia) దాడిలో మృతి చెందిన కర్ణాటక విద్యార్ధి నవీన్‌ శేఖరప్ప(Naveen Shekarappa) డెడ్‌బాడీ ఎట్టకేలకు సోమవారం బెంగళూరు(Bengaluru)కు చేరుకుంది. దాదాపు 20 రోజుల తర్వాత కర్ణాటకలోని అతని స్వగ్రామమైన హవేరీకి చేరుకుంది. నవీన్ స్వగ్రామంలో ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. అనంతరం నవీన్‌ మృతదేహాన్ని ఎస్‌ఎస్‌ ఆస్పత్రికి దానం చేయనున్నారు. ఎయిర్‌పోర్టులో కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై..నవీన్‌ డెడ్‌బాడీకి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నవీన్‌ స్వస్థలాలనికి తరలించారు.

ఈ నెల 1న ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో చివరి సంవత్సరం వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞాన్‌గౌడ్ మార్చి 1న సంఘర్షణ ప్రాంతంలో మరణించాడు. అతని చివరి చూపుల కోసం ఎదురుచూస్తున్నారు కుటుంబసభ్యులు. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో నవీన్‌ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో ఆలస్యమైంది. మధ్యాహ్నం నవీన్ డెడ్‌బాడీని దేవనాగరెలోని MBBS కాలేజీకి అప్పగించనున్నారు కుటుంబసభ్యులు.

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నవీన్ కుటుంబ సభ్యులు, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మరికొందరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని నవీన్ స్వస్థలమైన హవేరి జిల్లా రాణేబెన్నూరు తాలూకాలోని చల్గేరి గ్రామానికి తరలించారు. సంఘర్షణ ప్రాంతంలో నవీన్ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని సీఎం బొమ్మై అన్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని నవీన్‌ తల్లి నిరంతరం వేడుకుంటున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. వార్‌ జోన్‌ నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చే అవకాశంపైనా మొదట్లో అనుమానాలుండేవి. ఇది చాలా కష్టమైన పని, ప్రధాని నరేంద్ర మోడీ తన అపారమైన దౌత్య సామర్థ్యంతో దీనిని సాధించారని సీఎం చెప్పారు.

ఉక్రెయిన్ నుండి వేలాది మంది విద్యార్థులను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ, యుద్ధ ప్రాంతాల నుండి మన సైనికుల మృతదేహాలను చాలాసార్లు తీసుకురాలేము కాబట్టి ఇది అసాధ్యమని సీఎం బొమ్మై అన్నారు. ఒక సాధారణ పౌరుడి మృతదేహాన్ని తీసుకురావడం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. నవీన్‌ తల్లిదండ్రులు నివాళులర్పించిన అనంతరం మృతదేహాన్ని దావణగెరెలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి దానం చేయాలని నిర్ణయించారు.

Read Also… Coronavirus: మహమ్మారి నుంచి భారీ ఊరట.. 50కి దిగువనే మరణాలు.. యాక్టివ్‌ కేసులెన్నంటే..